/rtv/media/media_files/2025/04/09/K7FgrxrDjwJZezXE5AQN.jpg)
ఆమె వయసు 30ఏళ్లు. ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. ఆ మహిళ ఇంటర్మీడియేట్ సెకండ్ ఈయర్ విద్యార్థిని ప్రేమించింది. ఇది వరకే ఆమెకు రెండు పెళ్లిళ్లు కూడా అయ్యాయి. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో జరిగింది. షబ్నం అనే 30ఏళ్ల మహిళ బుధవారం ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న 18 బాలుడిని పెళ్లి చేసుకుంది. ఆమె హిందూ మతంలోకి మారి శివానిగా పేరు మార్చుకొని అతన్ని వివాహం చేసుకుంది. ఈ సమాచారం ఆలస్యంగా అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. హసన్‌పూర్ సర్కిల్ ఆఫీసర్ దీప్ కుమార్ పంత్ వివరాల ప్రకారం.. శివాని అనే మహిళను గతంలో షబ్నం అని పిలిచేవారు. ఆమెకు తల్లిదండ్రులు లేరు. గతంలో రెండుసార్లు వివాహం చేసుకుంది. మరోసారి ఓ ఇంటర్ సెకండ్ ఈయర్ బాలుడితో గుడిలో వివాహం చేసుకుంది.
Amroha: Mother of three children marries a 12th class student
— Mayank Burmee (@BurmeeM) April 9, 2025
-Shabnam divorced her husband and got married again
-Married to Shiva who was a 12th class student
If gender was reversed it would be a crime.
"HYPOCRISY" #UnusualMarriage #ViralStory #LoveMarriage… pic.twitter.com/fkitKCkVIP
Also read: BIG BREAKING: ట్రంప్‌కు చైనా బిగ్ షాక్.. అమెరికాపై 84శాతం ప్రతీకార సుంకాలు
ఉత్తరప్రదేశ్‌లో మతమార్పిడి నిరోధక చట్టం అమలులో ఉంది. ఉత్తరప్రదేశ్ చట్టవిరుద్ధ మతమార్పిడి నిషేధ చట్టం, కింద పోలీసులు కేసు నమోదు చేశారు. శివానీ మొదట మీరట్‌లో ఒక వ్యక్తిని వివాహం చేసుకున్నారని, కానీ అతనితో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత ఆమె సైదన్‌వాలి గ్రామానికి చెందిన తౌఫిక్‌ను వివాహం చేసుకుంది. అతను 2011లో రోడ్డు ప్రమాదంలో వికలాంగుడిగా మిగిలిపోయాడు. ప్రస్తుతం షబ్నం (శివాని) సెకండ్ ఈయర్ విద్యార్థిని పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లికి ఆ అబ్బాయి కుంటుంబ కూడా ఒప్పుకుంది. దీంతో హిందూ సాంప్రదాయం ప్రకారం దేవాలయంలో మ్యారేజ్ చేసుకున్నారు.