Hyderabad: అల్వాల్‌లో దారుణం.. తల్లిని చంపి ఇంట్లో పాతిపెట్టిన కూతురు!

కన్నప్రేమను మరిచి, కట్టుకున్న తల్లిని కాలయముడిలా మారి కడతేర్చిందో కుమార్తె. తన ప్రేమ వ్యవహారానికి అడ్డుపడుతోందన్న కోపంతో, ప్రియుడితో కలిసి తల్లిని చంపేయడమే కాకుండా..

New Update
alwal (1)

కన్నప్రేమను మరిచి, కట్టుకున్న తల్లిని కాలయముడిలా మారి కడతేర్చిందో కుమార్తె. తన ప్రేమ వ్యవహారానికి అడ్డుపడుతోందన్న కోపంతో, ప్రియుడితో కలిసి తల్లిని చంపేయడమే కాకుండా.. ఎవరికీ అనుమానం రాకుండా పది నెలల పాటు ఆ నిజాన్ని తన గుండెల్లోనే దాచుకుంది. చివరకు పోలీసుల దర్యాప్తులో ఈ దారుణ ఉదంతం బయటపడింది.

ఇంతకు ఏం జరిగిందంటే..  జవహర్‌నగర్‌ పరిధిలోని కౌకూర్‌ భరత్‌నగర్‌లో అంజు అనే మహిళ తన ఇద్దరు కుమార్తెలతో కలిసి నివసించేది. చిన్న కుమార్తె ఇషిక, మౌంటీరాజ్ అనే యువకుడితో ప్రేమలో పడింది. వీరిద్దరూ పెళ్లి చేసుకోకుండానే సహజీవనం చేయడానికి సిద్ధపడ్డారు. అయితే, కూతురి ప్రవర్తన నచ్చని తల్లి అంజు, ఆమెను పదే పదే మందలించేది. ప్రియుడితో తిరగవద్దని, పద్ధతిగా ఉండాలని హెచ్చరించింది. ఈ క్రమంలోనే తన ప్రేమకు తల్లి అడ్డుగా నిలుస్తోందని భావించిన ఇషిక, ఎలాగైనా ఆమెను వదిలించుకోవాలని ప్లాన్ వేసింది.

సుమారు 10 నెలల క్రితం, ఇషిక తన ప్రియుడు మౌంటీరాజ్‌తో కలిసి తల్లిని అత్యంత దారుణంగా హత్య చేసింది. హత్య చేసిన తర్వాత బయట పడేస్తే దొరికిపోతామన్న భయంతో, ఆ శవాన్ని తమ ఇంట్లోనే ఒక చోట గొయ్యి తీసి పూడ్చిపెట్టారు. ఆ తర్వాత ఏమీ ఎరుగనట్టుగా నాటకమాడారు. తల్లి కనిపించడం లేదని నమ్మించే ప్రయత్నం చేశారు.

Also Read :  కుప్పకూలిన ఆర్మీ విమానం.. 80 మంది సైనికులు మృతి!

పెద్ద కుమార్తె పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

తల్లి అదృశ్యంపై అనుమానం వచ్చిన పెద్ద కుమార్తె జవహర్‌నగర్‌ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు లోతుగా దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబ సభ్యుల ఫోన్ కాల్ డేటాను విశ్లేషించగా, ఇషిక మాటల్లో పొంతన లేకపోవడాన్ని గమనించారు. పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో ఇషిక అసలు నిజం ఒప్పుకుంది. తన ప్రియుడితో కలిసి తల్లిని చంపి ఇంట్లోనే పూడ్చిపెట్టినట్లు చెప్పడంతో పోలీసులు షాక్‌కు గురయ్యారు.

వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ప్రస్తుతం నిందితులు ఇషిక, ఆమె ప్రియుడు మౌంటీరాజ్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. కేవలం క్షణికావేశం, అడ్డులేని ప్రేమ కోసం కన్నతల్లిని చంపిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.

Also Read :  మరో ప్రైవేటు బస్సులో అగ్నిప్రమాదం.. కాలిబూడిదైన బస్సు

Advertisment
తాజా కథనాలు