BIG BREAKING: అన్నంలో విషం కలిపిపెట్టిన తల్లి.. నిద్రలోనే ముగ్గురు చిన్నారులు మృతి

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తల్లి పిల్లలకు తినే అన్నంలో విషం కలిపి పెట్టింది. నిద్రలోనే ముగ్గురు పిల్లలు చనిపోయారు. తర్వాత ఆమె కూడా ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. పిల్లల్ని చంపడానికి గల కారణం తెలియాల్సిఉంది.

New Update
ameenpur incident

ameenpur incident Photograph: (ameenpur incident)

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. కన్న తల్లే కర్కషంగా ఆలోచించి ముగ్గురు పిల్లలకు విషం పెట్టి చంపింది. తర్వాత ఆమె కూడా ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. ప్రస్తుతం తల్లి రజిత పరిస్థితి విషమంగా ఉంది. ఆమెను జీరంగూడ హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. బుధవారం రాత్రి  పిల్లలు తినే అన్నంలో విషం కలపి ఇచ్చింది తల్లి. దీంతో ముగ్గురు చిన్నారులు నిద్రలోనే చనిపోయారు. సాయి క్రిష్ణ (12), మధుప్రియ(10), గౌతమ్ (8) ముగ్గురు చనిపోయారు. కుటుంబ తగాదాలే కారణమా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also read: AIDS with drugs: కొంపముంచిన డ్రగ్స్ అలవాటు.. ఒకేసారి 10 మంది ఎయిడ్స్

Also read: Immigration Bill 2025: ఇండియా అలాంటి వారికి ధర్మసత్రం కాదన్న అమిత్ షా

రాఘవేంద్ర కాలనీకి చెందిన చెన్నయ్య డ్యూటీ ముగించుకొని ఇంటికి వచ్చి చూసే సరికీ భార్య, పిల్లలు అపస్మారక స్థితిలో ఉన్నారు. హాస్పిటల్ తరలిస్తుండగానే పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. భర్య రజిత పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఆమెకు డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. రజిత ఈ నిర్ణయం తీసుకోడానికి కుటుంబకలహాలే కారణమై ఉంటాయని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా ఇరుగుపొరుగువారిని, చెన్నయ్యను విచారిస్తున్నారు.

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు