ఆంధ్రప్రదేశ్ Nandigama: 20 ఏళ్ల పాటు బిడ్డల కోసం తల్లి తపన.. ముగ్గురికి జన్మనిచ్చి అంతలోనే విషాదం!! నందిగామ మండలంలోని మాగల్లు గ్రామానికి చెందిన షేక్ నజీరా(35)కు పల్లగిరికి చెందిన ఖాసింతో 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఖాసీం ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఆ దంపతులు పిల్లల కోసం ఎంతో తపించారు. ఏకంగా రెండు దశాబ్దాల పాటు ఎదురు చూశారు. తీరా దేవుడు కరుణింగా నజీరా గర్భం దాల్చింది. పది రోజుల క్రితం ఆమెను ప్రసవం కోసం విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. డాక్టర్లు శస్త్ర చికిత్స చేసి ఇద్దరు ఆడశిశువులు, ఓ మగశిశువును బయటకు తీశారు. ఐసీయూలో ఉంచి చికిత్స చేస్తున్నారు. మరోవైపు నజీరాకు రక్తం తక్కువగా ఉండటంతో.. వైద్యులు చికిత్స అందిస్తుండగా ఆమె మంగళవారం హఠాత్తుగా మరణించింది. By E. Chinni 10 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn