/rtv/media/media_files/2025/03/23/LOygEbvdsFjWLwDr9akF.jpg)
Meerut Navy officer Saurabh murder case another Big twist
Meerut: మీరట్ నేవీ అధికారి మర్డర్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ప్రియుడు సాహిల్‌తో కలిసి ముస్కాన్ రస్తోగి తన భర్త సౌరభ్ రాజ్‌పుత్‌ను చంపి.. అతని డెడ్ బాడీని డ్రమ్‌లో సిమెంట్ వేసి పూడ్చేసిన సంగతి తెలిసిందే. కాగా ప్రస్తుతం కస్టడీలో ఉన్న ప్రధాన నిందితురాలు ముస్కాన్ రస్తోగి గర్భవతి అని తేలింది. ఆరోగ్యం క్షిణించడంతో పరీక్షలు చేయించగా ఆమె ప్రెగ్నెంట్ అయినట్లు పోలీసులు వెల్లడించారు. పరీక్ష ఫలితాలు పాజిటివ్‌గా వచ్చాయని, ఆమె గర్భవతి అని నిర్ధారించారు.
మత్తుమందు ఇచ్చి హత్య..
ఈ మేరకు సౌరభ్ రాజ్‌పుత్ హత్య మీరట్‌లో సంచలనం సృష్టించింది. 27 ఏళ్ల నేవి అధికారిని అతని భార్య ముస్కాన్, ఆమె ప్రేమికుడు సాహిల్ శుక్లాతో కలిసి దారుణంగా హతమార్చింది. ముస్కాన్ ఈ నేరంలో కీలక పాత్ర పోషించగా.. తన భర్తకు మత్తుమందు ఇచ్చి చంపింది. తర్వాత ఈ జంట మృతుడి శరీరాన్ని ముక్కలు చేసి డ్రమ్‌లో సిమెంట్ తో కప్పేసి ఆధారాల్లేకుండా చేయాలని ప్రయత్నించింది. కానీ పోలీసులు దర్యాప్తులో బాగోతం బయటపడింది.
ఇది కూడా చూడండి: Agniveers: అగ్నివీరులకు గుడ్‌న్యూస్.. పోలీస్ నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు
ఈ హత్య తర్వాత ముస్కాన్, సాహిల్ హిమాచల్ ప్రదేశ్‌లోని కసోల్‌కు పారిపోయారు. అక్కడ వారు ఆరు రోజులు బస చేశారు. ఇద్దరూ భార్యభర్తలుగా నటిస్తూ ఒక హోటల్‌లో ఉన్నారు. మార్చి 10 నుంచి 16 వరకు బస చేసి మళ్లీ మీరట్‌కు తిరిగి వచ్చారు. హత్య అభియోగాలపై పోలీసులు ముస్కాన్, సాహిల్‌లను అరెస్టు చేశారు. విచారణలో హత్యలో తన ప్రమేయం ఉందని ముస్కాన్ అంగీకరించింది. సాహిల్ కూడా ఉన్నాడని చెప్పింది. దీంతో ఇద్దరినీ జైలుకు తరలించారు.
ఇది కూడా చూడండి: Jibli Trend: జిబ్లీలో ఫోటోలు అప్ లోడ్ చేస్తున్నారా..అయితే జాగ్రత్త
meerut | Meerut Case | pregnent | telugu-news | today telugu news