/rtv/media/media_files/2026/04/08/major-explosion-at-jalavihar-in-hyderabad-2026-04-08-18-22-25.jpg)
major explosion-at-jalavihar in hyderabad
హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ దగ్గర భారీ పేలుడు చోటుచేసుకుంది. జలవిహార్ RO ప్లాంట్‌లో ఈ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో అక్కడ పనిచేస్తున్న ఇద్దరు సిబ్బందికి తీవ్రంగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీళ్లలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పేలుడు ధాటికి అక్కడున్న పరికరాలు ధ్వంసమైపోయాయి. నీటి సరఫరా చేసే RO ప్లాంట్‌లో ఈ భారీ బ్లాస్ట్ జరిగింది. ఈ ప్రమాదానికి RO ఫిల్టర్ లేదా కంప్రెషర్‌లో అధిక ఒత్తిడి కారణమై ఉండొచ్చని అక్కడున్న సిబ్బంది అనుమానిస్తున్నారు. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Follow Us