Maharashtra Accident: పూణే హైవే పై ఘోర రోడ్డు ప్రమాదం.. నుజ్జునుజ్జయిన వాహనం! 9 మంది స్పాట్ డెడ్

మహారాష్ట్రలోని నాసిక్- పూణే హైవే పై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ఐచర్ వాహనం ప్రయాణికులతో వెళ్తున్న మాక్సిమో వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 9 మంది అక్కడిక్కడే మృతి చెందారు.

New Update
karnul accident

nasik -pune high way Accident

Maharashtra Accident:  దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ఒకే రోజు వేర్వేరు చోట్లలో కనీసం నాలుగు, ఐదు ప్రమాదాలు అయిన జరుగుతున్నాయి. ర్యాష్ డ్రైవింగ్, వాహనదారుల నిర్లక్ష్యం ఈ ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా ఉంటున్నాయి. అధికారులు ట్రాఫిక్ పలు ఆంక్షలు, నిబంధనలు విధించినప్పటికీ.. రోడ్డుపై కొంతమంది ఏమరపాటు అమాయకుల ప్రాణాలను బలితీసుకుంటుంది. తాజాగా మహారాష్ట్రలో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 

Also Read :   Breaking: హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో డీమార్ట్, రిలయన్స్ ట్రెండ్స్!

9 మంది స్పాట్ డెడ్.. 

మహారాష్ట్రలోని నాసిక్- పూణే హైవేపై వేగంగా వచ్చిన ఐచర్ వాహనం ప్రయాణికులతో వెళ్తున్న మాక్సిమో వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో ఆ వాహనం ముందున్న బస్సును ఢీకొంది. ఈ ప్రమాదంలో 9 మంది అక్కడిక్కడే ప్రాణాలు విడిచారు. ప్రమాదం దాటికి మాక్సిమో వాహనం నుజ్జునుజ్జయింది. 

Also Read: Life Style: ప్రపంచ చెత్త ఆహారాల జాబితాలో ఒకే ఒక్క ఇండియన్ ఫుడ్.. సోషల్ మీడియాలో నెటిజన్లు ఆగ్రహం!

షిరిడీలో మరో ప్రమాదం 

ఇది ఇలా ఉంటే షిరిడీలో మరో ప్రమాదం జరిగింది. షిరిడీ  విహార యాత్ర ఓ  కుటుంబంలో తీరని విషాదం నింపింది. భవనగిరి జిల్లాకు చెందిన ఓ కుటుంబ సభ్యులు రెండు రోజుల క్రితం షిరిడీ పర్యటనకు బయలుదేరారు. ఈ క్రమంలో షిరిడీ సమీపంలో వారు వెళ్తున్న వాహనం రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందగా.. మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఆరునెలల చిన్నారి ఉన్నారు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

Also Read :  తిరుమలలో ఇంటి దొంగ..రెండేళ్లలో ఆ కాంట్రాక్ట్ ఉద్యోగి ఎంత కొట్టేశాడంటే?

Also Read: Hari Hara Veera Mallu: పవన్ ఫ్యాన్స్ కి పూనకాలే.. 'హరిహర వీరమల్లు' లో పవన్ పాడిన పాట వచ్చేసింది!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు