/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/crime.jpg)
మహారాష్ట్రలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఈర్ష్యతో 13 ఏళ్ల బాలుడు ఓ చిన్నారిని హతమార్చిన దారుణ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. పాల్‌ఘర్ జిల్లాలో ఓ ఆరేళ్ల బాలికను కుటుంబ సభ్యులు, బంధువులు అందరూ కూడా ముద్దు చేస్తుండేవారు. ఇది చూడలేని బాలుడు ఈర్ష్యతో ఆ బాలికను చంపాలని ప్లాన్ చేశాడు.
ఇది కూడా చూడండి: ఐదో సారి తల్లి కాబోతున్న సీమా హైదర్... తండ్రిగా సచిన్ మీనాకు ప్రమోషన్ !
సినిమా చూసి ఆరేళ్ల బాలికను..
ఈ క్రమంలో రామన్ రాఘవ్ అనే సినిమా చూసి మరి ఆరేళ్ల బాలికను దారుణంగా హత్య చేశాడు. సమీపంలో ఉన్న గుట్ట దగ్గరకు తీసుకుని వెళ్లి ఆమె ముఖంపై పెద్ద బండరాయి వేశాడు. దీంతో ఆ బాలిక అక్కడిక్కడే మరణించింది. బాలిక కనిపించడం లేదని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
ఇది కూడా చూడండి: Blankets: దుప్పట్లు వాసన వస్తున్నాయా.. ఇలా చేస్తే సువాసన వెదజల్లుతాయి
ఇదిలా ఉండగా ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. సీతాపూర్ పొలాలలో తెగి పడిపోయిన బాలిక శరీర భాగాలు కనిపించాయి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేరుకున్నారు. ఫిబ్రవరి 27న డ్రోన్ నిఘా సహాయంతో సమీపంలోని పొలాల్లో బాలిక శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు.
ఇది కూడా చూడండి: Oscar Awards 2025 : ఆస్కార్ అవార్డులు ప్రదానోత్సవం .. విజేతలు వీళ్లే!
అందులో భాగంగా బాలిక శరీరంలోని తెగిపోయిన కాలు, ఛాతీ నుండి తల వరకు పై మొండెం కనిపించాయి. ఫోరెన్సిక్ బృందాలు నమూనాలను సేకరించి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి పంపించారు. బాలికను గొంతు కోసి చంపినట్లు పోస్ట్‌మార్టం రిపోర్టులో వెల్లడైంది. దీంతో ఈ కేసులో పలువురు అనుమానితులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.