/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Crime-Breaking-.jpg)
ప్రముఖ శివ క్షేత్రమైన మహానందిలో విషాద ఘటన చోటుచేసుకుంది. 25 ఏళ్ల నుంచి ఉన్న నాగనంది సదనం కూల్చివేత ఘటనలో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. మహా నంది క్షేత్రంలోని గాజులపల్లె టోల్ గేట్ దగ్గర 25 ఏళ్ల క్రితం భక్తుల కోసం నాగనంది సదనం వసతి గృహాలను నిర్మించారు. ఈ గదులు శిథిలం అయిపోవడంతో మళ్లీ కొత్తగా 50 గదుల నూతన వసతి గృహాల నిర్మాణాన్ని చేపట్టారు.
ఇది కూడా చూడండి: NASA: సునీతా విలియమ్స్ వచ్చేస్తున్నారు..క్రూ డ్రాగన్ ల్యాండింగ్ లైవ్
శిథిలాలు పడిపోవడంతో..
ఈ క్రమంలోనే భాగంగా నాగనంది సదనం కూల్చివేతను ఆలయ అధికారులు చేపట్టారు. ఈ కూల్చివేతల్లో పై కప్పు నుంచి శిథిలాలు పడిపోవడంతో ఒక కార్మికులు అక్కడిక్కడే మృతి చెందాడు. ఇంకో కార్మికుడికి తీవ్రంగా గాయలయ్యాయి. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు.
ఇది కూడా చూడండి: TG Budget 2025: నేడే తెలంగాణ బడ్జెట్.. ఆ పథకాలకు భారీగా నిధులు?
ఇదిలా ఉండగా ఇటీవల ఎన్టీఆర్ జిల్లాలో దారుణ విషాద ఘటన జరిగింది. పెనుగంచిప్రోలు తిరుపతమ్మ చిన తిరునాళ్ల ఎగ్జిబిషన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. జెయింట్ వీల్ తొట్టి ఊడిపడి వత్సవాయి మండలం కొత్త వేమవరంనకు చెందిన యువ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గింజుపల్లి సాయికుమార్ ప్రాణాలు కోల్పోయారు.
ఇది కూడా చూడండి: Horoscope:నేడు ఈ రాశి వారు వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి...!
ఈ ఘటనలో సాయికుమార్ సోదరుడు గింజుపల్లి గోపిచంద్‌కు తీవ్రగాయాలు కావడంతో విజయవాడ ఆస్పత్రికి తరలించారు. సాయికుమార్, గోపిచంద్ మంగళవారం ఎగ్జిబిషన్‌కు వచ్చి జెయింట్ వీల్ ఎక్కారు. ఇంతలో వారిద్దరు కూర్చున్న బకెట్ ఊడి పడింది. ఈ ఘటనలో సాయికుమార్ పక్కనే ఉన్న సిమెంట్ రోడ్డుపై పడిపోయారు.దీంతో సాయికుమార్ తల రోడ్డుకు బలంగా తగలడంతో ఘటనా స్థలంలోనే చనిపోయాడు. అతడి సోదరుడు గోపిచంద్ నేలపై పడటంతో కాలు, చేయి విరగడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు.