Khammam: అవమాన భారంతో పసిబిడ్డలను కడతేర్చి.. తాను ఆత్మహత్య చేసుకుంది ఓ తల్లి. కన్నప్రేమను మంచిపోయి పిల్లలను అతి కిరాతకంగా గొంతు నులిమి చంపేసింది. ఈ విషాదకరమైన ఘటన ఖమ్మం జిల్లా మధిర మండలం నిదానపురం గ్రామంలో చోటుచేసుకుంది.
Also Read: Meerpet Incident: 72 గంటలు భార్య శవాన్ని ఉడికించి.. ఆరబెట్టి పొడిచేసి.. ఇదొక భయంకరమైన హత్య!
భర్తను పోలీసులు తీసుకెళ్లారని..
వివరాల్లోకి వెళితే.. నిదానపురం గ్రామంలో షేక్ భాజీ, షేక్ ప్రేజా దంపతులు నివాసం ఉంటున్నారు. వీరిద్దరికీ మోహక్, మెహరూన్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. మెహరూన్ వయసు 7 సంవత్సరాలు, మోహక్ వయసు 6 సంవత్సరాలు. అయితే ఒకరోజు భర్త షేక్ భాజీ ఓ దొంగతనం కేసులో పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. దీంతో తీవ్ర అవమానంగా ఫీల్ అయిన భార్య ప్రేజా విచక్షణ కోల్పోయి ప్రవర్తించింది.
Also Read: Sreeleela Photos: ఫొటోకొక్క ఫోజు.. బ్లూ షర్ట్ లో శ్రీలీల చూపులకు కుర్రాళ్ళు పడిపోవాల్సిందే!
క్షణిక ఆవేశంలో తన ఇద్దరి పిల్లలు ఉరేసి తాను.. ఉరేసుకొని చనిపోయింది. ఎంతో భవిష్యత్తు ఉన్న ఆ చిన్నారులు తల్లి మతిలేనిపనికి జీవితం చాలించారు. వీరి మరణవార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఎందుకు చనిపోయారో కూడా తెలియని ఆ పసిబిడ్డల పరిస్థితి చూస్తుంటే ప్రతి ఒక్కరి హృదయం తరుక్కుపోతుంది.
Also Read: Urvashi Rautela: బజ్ కోసం ఊర్వశీ బాత్రూం వీడియో లీక్ చేసిన మేకర్స్! వీడియో వైరల్
Also Read: Maharashtra Train Accident: 12 మంది ప్రాణాలు తీసిన పుకారు.. రైలు ప్రమాదానికి ఇదే కారణం