/rtv/media/media_files/2025/02/25/xiRJ9uejNXo7VOKkKOXB.jpg)
kerala crime Photograph: (kerala crime)
23ఏళ్ల యువకుడు కుటుంబసభ్యులందరినీ కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటన కేరళలోని తిరువనంతపురంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీస్ స్టేషన్‌కు వచ్చి తాను ఆరుగురిని హత్య చేసినట్లు అఫాన్ సరెండర్ అయ్యాయి. అంతేకాదు అతడు కూడా విషం తాగి ఆత్మహత్యాయత్నం చేశానని పోలీసులకు తెపిపాడు. తమ్ముడు, అమ్మమ్మ, అత్త, మామ, ప్రియురాలిని హత్య చేశానని యువకుడు చెప్పాడు. నిందితుడు తల్లిపై దాడి చేయగా.. ఆమెకు తీవ్రగాయాలు అయ్యాయి. ప్రస్తుతం హాస్పిటల్‌లో చికిత్స పొందుతుంది.
Also Read : BIG BREAKING: కోల్‌కతాలో భారీ భూకంపం
అఫాన్ చెప్పిన వివరాల ప్రకారం.. పోలీసులు ఇప్పటివరకు ఐదు మరణాలను నిర్ధారించారు. సోమవారం సాయంత్రం కొన్ని గంటల వ్యవధిలో మూడు వేర్వేరు ప్రదేశాలలో ఈ హత్యలు జరిగాయి. నిందితుడు అఫాన్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయి సంఘటనల క్రమాన్ని వివరించిన తర్వాత ఇది వెలుగులోకి వచ్చింది. అఫాన్ అతని 13 ఏళ్ల సోదరుడు అహసన్, అమ్మమ్మ సల్మా బీవీ, మామ లతీఫ్, అత్త షాహిహా, అతని స్నేహితురాలు ఫర్షానా మరణించినట్లు పోలీసులు నిర్ధారించారు. అఫాన్ తల్లి పరిస్థితి విషమంగా ఉంది. తిరువనంతపురంలోని మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. నిందితుడు తాను విషం సేవించానని పోలీసులకు సమాచారం అందించాడు. దీని తరువాత, అతన్ని చికిత్స కోసం మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. ఈ హత్యల వెనుక గల ఉద్దేశ్యాన్ని పోలీసులు ఇంకా నిర్ధారించలేదు. సామూహిక హత్యలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Also read : Delhi: సీఎం రేఖా గుప్తా జీతం, అరవింద్ కేజ్రీవాల్ పెన్షన్ ఎంతో తెలుసా ?