/rtv/media/media_files/2026/02/09/daughter-2026-02-09-16-12-05.jpg)
అమ్మాయికి పెళ్లి చేసి అత్తగారింటికి పంపిస్తే.. అక్కడ ఆమెను ఓ కూతురి లాగా చూసుకోవాల్సింది పోయి నరకం చూపించారు అత్తమామలు(daughter-in-law). చివరకు ఆ యువతి ప్రాణం తీసుకునేలా చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీదర్ జిల్లా బసవకల్యాణ్‌లో అంజనాబాయి (25) అనే వివాహిత ఆత్మహత్య ఘటన ఇప్పుడు స్థానికంగా పెను సంచలనం సృష్టిస్తోంది.
2022లో అంజనాబాయికి శేఖర్ పాటిల్ అనే వ్యక్తితో పెళ్లి అయింది. శేఖర్ పానీపూరి అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. పెళ్లయిన కొత్తలో అంతా బానే ఉన్నా, కొన్నాళ్లకే గొడవలు మొదలయ్యాయి. శేఖర్ రోజూ ఆలస్యంగా ఇంటికి రావడాన్ని అంజనాబాయి ప్రశ్నించేది. దీనిని సాకుగా తీసుకున్న అత్త అరుణాబాయి, మామ చంద్రకాంత్ పాటిల్.. నీకు వంట రాదు, నువ్వు దేనికీ పనికిరావు అంటూ ప్రతిరోజూ మానసికంగా, శారీరకంగా వేధించడం మొదలుపెట్టారు.
అంజనాబాయి తండ్రి విజయ్ కుమార్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వెల్లడించిన విషయాలు వింటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. అంజనాబాయి చనిపోయే ముందు తన తండ్రికి ఫోన్ చేసి కన్నీరు పెట్టుకుంది. నా అత్తకు ఒక అక్రమ సంబంధం ఉంది.. నన్ను కూడా తనతో కలిసి వ్యభిచార వృత్తిలోకి రావాలని వేధిస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది. భర్త, అత్తమామల వేధింపులకు తోడు, ఈ నీచమైన కోరికతో ఆమె తీవ్రంగా కలత చెందింది. - karnataka
Also Read : దారుణం.. తోటి విద్యార్థిని కాల్చి చంపి సూసైడ్ చేసుకున్న స్టూడెంట్.. వీడియో వైరల్
అత్తగారింట్లో నరకం అనుభవించలేక
ఈ విషయాలను బయట ఎవరికీ చెప్పుకోలేక, అత్తగారింట్లో నరకం అనుభవించలేక అంజనాబాయి ఫిబ్రవరి 6 వ తేదీన తన భర్త ఇంట్లోనే ఉరివేసుకుని ప్రాణాలు వదిలింది. తన కూతురిని ఈ ముగ్గురే వేధించి చంపేశారని తండ్రి విజయ్ కుమార్ బసవకల్యాణ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులైన శేఖర్ పాటిల్, అరుణాబాయి, చంద్రకాంత్ లపై విచారణ చేపట్టారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, సాక్ష్యాలను సేకరిస్తున్నారు. ఈ కేసులో మరిన్ని నిజాలు తెలియాల్సి ఉంది. కన్నకూతురు లాంటి కోడలిని తప్పుడు దారిలోకి నెట్టాలని చూసిన ఆ అత్తమామల తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. నిందితులకు కఠిన శిక్ష పడాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read : భారీ ఆన్ లైన్ గేమింగ్ స్కామ్ గుట్టు రట్టు... దుబాయ్ కేంద్రంగా రూ. 5,000 కోట్ల భారీ కుంభకోణం
Follow Us