Dog: పెంచుకున్న పాపానికి.. యజమాని ప్రాణం తీసిన కుక్క

ప్రేమగా పెంచుకున్నందకు ఓ కుక్క యాజమాని ప్రాణం తీసిన ఘటన కాన్పూర్‌లో జరిగింది. ఇంటి ఆవరణంలో ఉన్న యజమానిపై కుక్క అకస్మాత్తుగా దాడి చేసింది. ముఖం, కడుపుపై దాడి చేయడంతో అక్కడిక్కడే మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

New Update
dog bite

dog bite

ఎంతో ప్రేమగా పెంచుకున్న పాపానికి ఓ కుక్క ఏకంగా యజమాని ప్రాణం తీసింది. వివరాల్లోకి వెళ్తే.. కాన్పూర్‌లోని వికాస్ నగర్‌లో ఓ మహిళ జర్మన్ షెపర్డ్ అనే కుక్కను ఎంతో ప్రేమగా పెంచుకుంటుంది. అనుకోకుండా ఆ కుక్క యజమానిపై దాడి చేసింది. మొదట్లో ఆ కుక్క ఇతరులను చూసి అరుస్తుందని ఇంట్లో వారంతా భావించారు. కానీ ఆ తర్వాత బయటకు వెళ్లి చూసే సరికి యజమాని ముఖం, కడుపు, నడుముపై తీవ్రంగా గాయాలు చేసింది.

ఎందుకు కరిచిందనే విషయం..

దీంతో ఆ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక కౌన్సిలర్‌ పోలీసులకు సమాచారం అందించారు. సొంత బిడ్డలా చూసుకున్నందుకు యజమానిని ఆ కుక్క కరిచి చంపేసింది. అయితే ఆ కుక్క ఎందుకు యజమానిని కరిచి చంపిందనే విషయం తెలియదు. పోలీసులు ఈ విషయంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

ఇది కూడా చూడండి: NASA: సునీతా విలియమ్స్ వచ్చేస్తున్నారు..క్రూ డ్రాగన్ ల్యాండింగ్ లైవ్

ఇటీవల ఉత్తర్ ప్రదేశ్‌లో దారుణ ఘటన జరిగింది. ఓ నేవీ ఉద్యోగి... భార్యను ఎంతో ఇష్టపడి ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఎన్నో కలలతో జీవితాన్ని మొదలు పెట్టాడు. కానీ ఆ ప్రేమే అతడి పాలిట యమపాశం అవుతుందని ఊహించుకోలేకపోయాడు. ప్రియుడి కోసం కట్టుకున్న భర్తను అత్యంత కిరాతకంగా హత్య చేసింది భార్య. 

ఇది కూడా చూడండి: Horoscope:నేడు ఈ రాశి వారు వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి...!

లవర్ తో కలిసి భర్తను చంపి.. డెడ్ బాడీని ముక్కలు ముక్కలుగా చేసి.. శరీర భాగాలను సిమెంట్ తో నింపిన ప్లాస్టిక్ డ్రమ్ లో కప్పి పెట్టారు. రెండు గంటల పాటు కష్టపడిన పోలీసులు డ్రమ్ ని తెరవలేకపోయారు. చివరికి డ్రమ్‌ను కత్తిరించగా.. శరీర భాగాలు సిమెంట్ తో గడ్డకట్టిపోయి ఉన్నాయి. ఈ ఒళ్లుగగ్గుర్పొడిచే ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో జరిగింది. 

ఇది కూడా చూడండి: TG Budget 2025: నేడే తెలంగాణ బడ్జెట్.. ఆ పథకాలకు భారీగా నిధులు?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు