ఈ ప్రపంచంలో పోటీ పడలేకపోతున్నారని అతి కిరాతంగా ఇద్దరు పిల్లలను తండ్రి చంపిన విషాదం గురించి తెలిసిందే. కాకినాడలో జరిగిన ఈ ఘటనలో తాజాగా మరో కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. ఇద్దరు పిల్లలను అతికిరాతంగా చంపిన చంద్రకిశోర్ సైకో మెంటాలిటీ కాదని బంధువులు చెబుతున్నారు. గతంలో పిల్లల చదువుల కోసం లక్షల్లో ఖర్చు పెట్టారట. ఇక ఆర్థిక ఇబ్బందులు రావడంతో పిల్లలను తక్కువ ఫీజు ఉన్న స్కూళ్లలో చేర్చారట. ఇలా లక్షలు కట్టి పిల్లలను చదివించగలనో లేదో? ఈ పోటీ ప్రపంచంలో పిల్లలు పోటీ పడగలరో లేదో? అనే ఆత్మన్యూనత భావంతో ఇలా చేసి ఉంటాడని బంధువులు అంటున్నారు. పిల్లలు చదవడం లేదని చంపే అంతా కర్కశుడు చంద్రశేఖర్ కాదని చెబుతున్నారు.
ఇది కూడా చూడండి: Coolie OTT Rights: కోట్లు కొల్లగొడుతున్న 'కూలీ'.. ఇది కదా రజిని రేంజ్..!
పది నిమిషాల్లో వస్తానని చెప్పి..
వానపల్లి చంద్రకిశోర్ కాకినాడ జిల్లా వాకలపూడిలోని ఓఎన్‌జీసీ కార్యాలయంలో అసిస్టెంట్ ఎకౌంటెంట్‌గా పని చేస్తున్నాడు.ఇతనికి భార్య తనూజ, ఇద్దరూ పిల్లలు జోషిల్ (7), నిఖిల్ (6) ఉన్నారు. అయితే పిల్లలు సరిగ్గా చదవడం లేదని వారిని ఇటీవలే స్కూల్ మార్పించారు. హోలీ సందర్భంగా చంద్రకిశోర్ శుక్రవారం భార్య, పిల్లలను తీసుకుని తమ ఆఫీసులో వేడుకలకు వెళ్లాడు.
అక్కడే ఉండాలని పిల్లలకు యూనిఫాం కొలతలు తీయించడానికి టైలర్ వద్దకు పిల్లలను తీసుకెళ్తున్నానని, పది నిమిషాల్లో వస్తానని భార్యను అక్కడే ఉండమని చెప్పి వెళ్లాడు.ఎంతసేపటికీ భర్త రాకపోవడం, ఫోన్ చేసినా ఎత్తకపోవడంతో తనూజ తోటి ఉద్యోగులతో కలిసి ఇంటికి చేరారు. కిటికీలోంచి చూడగా, భర్త ఫ్యాన్‌కు ఉరి వేసుకుని చనిపోయి ఉన్నాడు.
ఇది కూడా చూడండి: PAK Vs BLA: రెండు ముక్కలుగా పాక్.. మరో దేశంగా అవతరించనున్న బలూచ్!
బలవంతంగా తలుపులు తెరిచి చూడగా, పిల్లలిద్దరూ కాళ్లూ చేతులకు కట్లతో నిండా నీళ్లు ఉన్న బకెట్‌లలో తలలు మునిగిపోయి ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం, సొంతిల్లు, మంచి కుటుంబం ఉన్నా కూడా ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో తమ పిల్లలు రాణించడం లేరని అందుకే ఇద్దరు పిల్లలను చంపి తాను కూడా చనిపోతున్నానని చంద్రకిశోర్ సూసైడ్ నోటును గుర్తించారు.
ఇది కూడా చూడండి: WPL 2025 : ఢిల్లీ బ్యాడ్ లక్.. మూడోసారి కూడా ఫైనల్లో ఓటమే!