/rtv/media/media_files/2025/04/01/8pyjKKPLCIJB4mK8thOi.jpg)
Train Accident Photograph: (Train Accident)
ఈ మధ్య కాలంలో రైలు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఒక రైలు మరో రైలును ఢీకొట్టడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అయితే తాజాగా జార్ఖండ్‌లోని సాహిబ్‌గంజ్ జిల్లాలో మరో రైలు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. సాహిబ్‌గంజ్‌లోని బర్హెట్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని ఫరక్కా-లాల్మాటియా ఎంజిఆర్ రైల్వే లైన్‌లో ఒక పెద్ద రైల్వే ప్రమాదం సంభవించింది.
ఇది కూడా చూడండి: Ashwani Kumar : డెత్ ఓవర్ల స్పెషలిస్ట్.. రూ. 30లక్షలకు ముచ్చెమటలు పట్టించాడు!
#Jharkhand #BreakingNews
— Indian Observer (@ag_Journalist) April 1, 2025
Direct collision between two goods trains in #Sahibganj : 2 loco pilots killed; 4 CISF personnel also injured, rescue operation underway #JharkhandUpdate #BREAKING #trainaccident #India #TRAIN https://t.co/hDHVbC0av5 pic.twitter.com/VuxARAL5yU
ఇది కూడా చూడండి: Horoscope Today: ఈ రాశివారు నేడు వివాదాలకు దూరంగా ఉంటే బెటర్!
ఒకదానికొకటి ఢీకొనడంతో..
ఫరక్కా నుంచి వస్తున్న ఖాళీ గూడ్స్ రైలు బర్హెట్ ఎంటీ దగ్గర నిలబడి ఉంది. ఇంతలో లాల్మాటియా వైపు వెళ్తున్న బొగ్గుతో ఉన్న త్రూపాస్ గూడ్స్ రైలు దానిని బలంగా ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో లోకో పైలట్‌తో పాటు మరో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురు రైల్వే కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వీరిని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. వెంటనే అక్కడికి పోలీసులు చేరి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఎలా రెండు రైళ్లు ఢీకొట్టాయని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇది కూడా చూడండి: IPL 2025: బోణీ కొట్టిన ముంబై..ఐపీఎల్ లో మరో రికార్డ్