Jeffrey Epstein: జెఫ్రీ ఎప్‌స్టీన్ వింత ప్రయోగాలు.. వందల మంది పిల్లల్ని పుట్టించాలని ల్యాబ్

ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో చీకటి కోణాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. జెఫ్రీ ఎప్‌స్టీన్ అనే ఓ అమెరికా ఫైనాన్షియర్ ఒక ప్రైవేట్ ఐల్యాండ్ కొని, అక్కడికి వెళ్లడానికి ఓ జెట్ విమానం ఏర్పాటు చేసుకొని ఓ రహస్య సామ్రాజ్యాన్నే నిర్మించాడు.

New Update
Jeffrey Epstein

ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో చీకటి కోణాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. జెఫ్రీ ఎప్‌స్టీన్ అనే ఓ అమెరికా ఫైనాన్షియర్ ఒక ప్రైవేట్ ఐల్యాండ్ కొని, అక్కడికి వెళ్లడానికి ఓ జెట్ విమానం ఏర్పాటు చేసుకొని ఓ రహస్య సామ్రాజ్యాన్నే నిర్మించాడు. అక్కడికి సామాన్య మానవులకు ప్రవేశం లేదు. కోట్లకు అధిపతులు, అధికారం చేతుల ఉన్న దేశాధినేతలు, పెట్టుబడిదారులు, పవర్‌ఫుల్ బిజినెస్‌మ్యాన్లు మాత్రమే వెళ్లగలరు. 

Also Read :  బంగ్లాదేశ్‌లో మరో హిందూ నేత మృతి

Jeffrey Epstein Experimented With His Semen

జెఫ్రీ ఆయన దీవికి వచ్చిన అధితులకు ఇచ్చే రాచమర్యాదలు వారికి గొప్పగా ఉండొచ్చు. కానీ.. అవి వింటే మనకు రోతగా ఉంటాయి. కోరికలను తీర్చడానికి మైనర్ బాలికలను సప్లై చేయడం, చిన్న పిల్లలపై క్రూరాతి క్రూరంగా ప్రవర్తిచడం(Jeffrey Epstein sex scandal), పనైపోయాక వారిని చంపి తినడం చేస్తారని ఆరోపణలు ఉన్నాయి. కేవలం హ్యూమన్ ట్రాఫికింగ్‌యే కాకుండా.. జెఫ్రీ ఎప్‌స్టీన్‌కు వింత వింత కలలు ఉన్నాయి. అతని వీర్యంతో ఓ 'సూపర్ రేస్'ను సృష్టించాలని ప్లాన్ చేసినట్లు వెలుగులోకి వచ్చింది. దాని కోసం న్యూ మెక్సికోలోని తన 'జోరో రాంచ్'ను ఓ బేబీ ఫామ్‌గా మార్చాలని జెఫ్రీ భావించినట్లు తెలుస్తోంది.

మానవ జాతిని తన సొంత DNAతో నింపాలని ఎప్‌స్టీన్(Epstein files controversy) కలలు కన్నాడు. ఇందుకోసం ఒకేసారి 20 మంది మహిళలకు కృత్రిమ గర్భధారణ చేయించి, వారికి తన పిల్లలను కనేలా చేయాలని ప్లాన్ చేశాడు. జన్యు ఇంజనీరింగ్ ద్వారా మానవ మేధస్సును, ఆరోగ్యాన్ని పెంచి ఒక ఉన్నతమైన జాతిని సృష్టించాలనే 'యూజెనిక్స్' సిద్ధాంతంపై ఆయనకు ఆసక్తి ఉండేది. దీనిని విమర్శకులు నాజీల కాలం నాటి జుగుప్సాకరమైన ఆలోచనగా అభివర్ణిస్తారు. తన పిచ్చి ఆలోచనలను సాకారం చేసుకోవడానికి ఆయన ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తలను తన విందులకు ఆహ్వానించేవాడు. హార్వర్డ్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలకు భారీగా విరాళాలు ఇచ్చి, అక్కడ తన సిద్ధాంతాలపై చర్చలు జరిపేవాడు. కొందరు శాస్త్రవేత్తలు ఆయనను 'మేధోపరమైన మోసగాడు' అని పిలిచినా, మరికొందరు ఆయన ఇచ్చే డబ్బుల కోసం మౌనంగా ఉండేవారు.

మరణం తర్వాత కూడా తిరిగి జీవించాలనే కోరికతో తన తల, లైంగిక అవయవాలను ఫ్రీజ్ చేసి భద్రపరచాలని ఎప్‌స్టీన్ కోరుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల బయటపడిన రికార్డుల ప్రకారం, ఈ జోరో రాంచ్ బాధితులకు ఒక నరకంలా ఉండేది. అక్కడ మహిళల కదలికలపై నిఘా ఉంచేవారని, బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా వారిని నియంత్రించేవారని బయటపడింది. ఎప్‌స్టీన్ మరణించినప్పటికీ, ఆయనకు సంబంధించిన దాదాపు 10 లక్షలకు పైగా ఫైళ్లు ఇంకా పరిశీలనలో ఉండటం గమనార్హం. ఈ వ్యవహారం కేవలం లైంగిక నేరమే కాదు, సైన్స్ పేరుతో మానవ హక్కులను ఎలా కాలరాశారో స్పష్టం చేస్తోంది.

Also Read :  రష్యా లో దారుణం.. దుండుగుడు కత్తితో దాడి.. నలుగురు భారతీయ విద్యార్థులకు తీవ్ర గాయాలు

Advertisment
తాజా కథనాలు