Hyd Old city: జీవితం ఎంతో విలువైంది. కానీ కొంతమంది చిన్న విషయానికే ఘోరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఉసురు తీసుకుంటున్నారు. ఇటీవల హైదరాబాద్ నగరంలో నడిరోడ్డుపై వివాహిత బలవన్మరణానికి పాల్పడడం కలకలం రేపింది. ఆమెకు వచ్చింది ఎంత పెద్ద కష్టమో తెలీదు కానీ.. ఆమె నిర్ణయం మాత్రం ఒక జీవితాన్ని బలి తీసుకుంది.
మంగళవారం తెల్లవారుజామున ఈ ఘోరం జరిగింది. పాతబస్తీకి చెందిన తాహనజర్.. దబీర్ పూర్ ఫ్లై ఓవర్ పై నుంచి దూకింది. 50 అడుగుల ఎత్తు నుంచి కింద రోడ్డుపైకి దూకటంతో స్పాట్ లోనే చనిపోయింది ఆ వివాహిత. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు.. హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి.. పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చూడండి: SSMB 29 Updates: అలాంటి సాహసం ఎప్పుడూ చేయలేదు.. SSMB 29 పై రాజమౌళి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్
తాహనజర్ బలవన్మరణానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మహిళ మృతికి కుటుంబ కలహాలేమైన కారణమా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఎక్కువ శాతం మహిళలు ఇంట్లోనే బలవన్మరణాలకు పాల్పడుతుంటారు. కానీ తాహనజర్ తెల్లవారుజామున నడిరోడ్డుపైకి వచ్చి ప్రాణాలు తీసుకోవడం వెనుక బలమైన కారణమే ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.
Also Read: Mangalavaaram: ఇది అస్సలు ఊహించలేదు.. 'మంగళవారం' సీక్వెల్ లో హీరోయిన్ గా ఎవరంటే!
hyderabad | old-city | sucide | telugu-news