Hyderabad: నార్సింగిలో ఘోరం.. బండరాళ్లతో మోది జంట హత్య!

హైదరాబాద్ నార్సింగిలో జంట హత్య కలకలం రేపుతోంది. పుప్పాలగూడ అనంత పద్మనాభస్వామి గుట్టపై మహిళను బండరాళ్లతో మోది చంపిన వ్యక్తి అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్నాడు. కారణం తెలియాల్సివుంది. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ బృందాలు రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తున్నాయి. 

New Update

Hyderabad: హైదరాబాద్ నార్సింగిలో జంట హత్య ఘటన కలకలం రేపుతోంది. పుప్పాలగూడ అనంత పద్మనాభస్వామి గుట్టపై మహిళను బండరాళ్లతో మోది చంపిన వ్యక్తి అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ బృందాలు రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తున్నాయి. 

బండరాయితో తల పగలగొట్టి..

అయితే సంక్రాంతి పండుగ సందర్భంగా స్థానికులు, యువకులు గుట్టపై పతంగులు ఎగురవేయడానికి వెళ్లారు. ఈ క్రమంలో మృతదేహాలు కనిపించడంతో ఒక్కసారిగి ఉలిక్కిపడి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటా హుటిన డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ బృందాలు అక్కడకు చేరకుని దర్యాప్తు ప్రారంభించాయి.

ఇది కూడా చదవండి: Khammam: అన్నా నన్ను చంపేస్తున్నారు.. ఖమ్మంలో యువకుడి కిడ్నాప్ కలకలం!

మొదటగా మహిళను రేప్ హతమార్చిన యువకుడు ఆ తర్వాత తాను సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమెకు ఒంటిపై బట్టలు లేకపోవడంతో రేప్ జరిగిందని, ఈ మర్డర్ కు కారణం అక్రమ సంబంధమేననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఇద్దరిమధ్య ప్రేమ వ్యవహారం కూడా ఉందని పోలీసులు భావిస్తున్నారు. దర్యాప్తులో పూర్తి వివరాలు వెల్లడిస్తామని రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. 

ఇది కూడా చదవండి: జగన్ కు బిగ్ షాక్.. మరో కీలక నేత ఔట్.. ఈ నెలలోనే జంప్?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు