/rtv/media/media_files/2025/03/11/zAULr4mARqRYeQdRvM7J.jpg)
Habsiguda Photograph: (Habsiguda)
హైదరాబాద్‌లోని హబ్సీగూడలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ కుటుంబంలోని నలుగురు మృతి చెందారు. ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడలేక ఓ వ్యక్తి తన భార్య, పిల్లలను చంపేసి తాను చనిపోయాడు. వివరాల్లోకి వెళ్తే.. హబ్సీగూడలోని స్ట్రీట్ నెంబర్ 8లో చంద్రశేఖర్ రెడ్డి నివాసం ఉంటున్నాడు. గతంలో ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్‌గా ఉద్యోగం చేసేవారు.
ఇది కూడా చూడండి: Niharika Konidela: నిన్ను అత్యంత ప్రేమిస్తున్నాను.. నిహారిక ఎమోషనల్ పోస్ట్ ఎవరి గురించో తెలుసా!
ఆర్థిక సమస్యలు ఎక్కువ కావడంతో..
గత ఆరు నెలల నుంచి ఉద్యోగం చేయడం లేదు. ఈ క్రమంలో ఇంట్లో ఆర్థిక సమస్యలు ఎక్కువయ్యాయి. వీటిని భరించలేక కొడుకు విశ్వాన్ రెడ్డి(10)కి విషం ఇచ్చి, కూతురు శ్రీత రెడ్డి(15)ని ఊరేసి చంపేశారు. ఆ తర్వాత భార్యతో కలిసి చంద్రశేఖర్ రెడ్డి కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఓ సూసైడ్ నోట్ రాసి చనిపోయారు.
ఇది కూడా చూడండి: Horoscope Today: నేడు ఈ రాశివారికి అసలు బాలేదు..కాస్త జాగ్రత్తగా ఉండండి!
తన చావుకి ఎవరూ కారణం లేదని, మానసికంగా, శారీరకంగా, కెరీర్ విషయంలో చాలా సమస్యలు ఉన్నాయని ఆ సూసైడ్ లేఖలో పేర్కొన్నారు. నరాలు, కిడ్నీ సంబంధిత సమస్యలు, మధుమేహం వంటివి ఉన్నాయని, వేరే మార్గం లేక ఇలా ఆత్మహత్య చేసుకుంటున్నానని సూసైడ్ నోట్‌లో రాశారు.
ఇది కూడా చూడండి: Elan Musk: ఎక్స్ సేవల్లో అంతరాయం..ఇది భారీ సైబర్ దాడే అంటున్న మస్క్!
ఇది కూడా చూడండి: Lalit Modi: 'వనువాటు అందమైన దేశం'.. లలిత్ మోదీ సంచలన పోస్ట్