తమిళనాడులో పండగపూట విషాదం.. ఘోర రోడ్డు ప్రమాదం

తమిళనాడులోని కరూర్ జిల్లా కుళితలైలో కరూర్-తిరుచ్చి జాతీయ రహదారిపై కారు ఎదురుగా వస్తున్న ప్రభుత్వ బస్సును ఢీకొట్టింది. దీంతో కారులో మంటలు చెలరేగి పూర్తిగా కాలిపోయింది . ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మరో  నలుగురికి తీవ్రగాయాలైయ్యాయి. 

New Update
tamilanadu road accident

tamilanadu road accident Photograph: (tamilanadu road accident)

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తమిళనాడులోని కరూర్ జిల్లా కుళితలైలో కరూర్-తిరుచ్చి జాతీయ రహదారిపై కారు ఎదురుగా వస్తున్న ప్రభుత్వ బస్సును ఢీకొట్టింది. దీంతో కారులో మంటలు చెలరేగి పూర్తిగా కాలిపోయింది. వేగంగా వచ్చి బస్సును ఢీకొట్టడంతో కారు మొత్తం నుజ్జునుజ్జు అయ్యింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మరో  నలుగురికి తీవ్రగాయాలైయ్యాయి. 

Also Read: CM Revanth: నేడు ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

కరూర్-తిరుచ్చి జాతీయ రహదారిపై కిలోమీటర్ మేరా నిలిచింది ట్రాఫిక్. గంటపాటు మంటలు ఆర్పి ఐదుగురి మృతదేహాలను బయటకు తీశారు అగ్నిమాపక సిబ్బంది. గాయాలపాలైన వారిని హాస్పిటల్‌కు తరలించారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Gym Trainer Kills : జిమ్‌ నిర్వాహకుడిని చంపిన యువకుడు.. డంబెల్స్‌తో కొట్టి కొట్టి....

జిమ్ ట్రైనర్ పై డంబెల్ తో దాడి చేసిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. జిమ్‌ట్రైనర్‌ అయిన ఓ యువకుడిని అతని స్నేహితుడే దారుణంగా హత్య చేశాడు. జిమ్‌లో ఉండగా డంబెల్స్‌తో కొట్టి చంపాడు. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.

New Update
Gym Trainer Kills

Gym Trainer Kills

Gym Trainer Kills :  హైదరాబాద్‌ బోడుప్పల్‌లో విషాదం నెలకొంది. ఓ యువకుడిని అతని స్నేహితుడే దారుణంగా హత్య చేశాడు. జిమ్‌లో ఉండగా డంబెల్స్‌తో కొట్టి చంపాడు. వివాహేతర సంబంధం కారణంగానే ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇది కూడా చదవండి:  పాపం ప్రణీత్.. గంట పాటు చిత్ర హింసలు పెట్టి చంపిన ఫ్రెండ్స్.. అసలేమైందంటే..!


 బోడుప్పల్‌ కళానగర్‌ కాలనీకి చెందిన ఏర్పుల సాయి కిశోర్‌ , చంటి ఇద్దరూ స్నేహితులు. కొంతకాలంగా వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో కిశోర్‌ మీద కక్ష పెంచుకున్న చంటి.. సోమవారం రాత్రి 8 గంటల సమయంలో కిశోర్‌కు చెందిన జస్ట్‌ ఫిట్‌ జిమ్‌కు వెళ్లాడు. అతనితో పాటు మరో ముగ్గురు స్నేహితులను తీసుకెళ్లాడు. అక్కడ మళ్లీ గొడవ జరగడంతో చంటి జిమ్‌లో ఉన్న డంబెల్‌ తీసుకుని కిశోర్‌ తలపై విచక్షణారహితంగా దాడి చేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు.

ఇది కూడా చదవండి: Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి బెయిల్.. కానీ నో రిలీజ్

ఇది కూడా చదవండి: ఆఫీసు పనిలో సహోద్యోగులు ఎగతాళి చేస్తున్నారా.. ఇలా చేయండి

చంటి దాడిలో తీవ్రంగా గాయపడిన కిశోర్‌ను వెంటనే ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో గాంధీ హాస్పిటల్ కు తరలించారు.అక్కడే చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం కిశోర్‌ మరణించాడు. దీంతో కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చంటిని అదుపులోకి తీసుకున్నారు. అతనికి సహకరించిన ముగ్గురు స్నేహితులు పరారీలో ఉన్నట్లు సమాచారం. కాగా, వారికోసం పోలీసులు గాలిస్తున్నారు.వివాహేతర సంబంధమే ఈ హత్యకు గల కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితున్ని విచారించాక అన్ని విషయాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

Also Read: తెగ తాగేసిన మందు బాబులు..గతేడాది కంటే తెలంగాణలో భారీగా పెరిగిన మద్యం అమ్మకాలు!

Also Read: ఆ నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకోండి..లేదంటే...చైనాకు ట్రంప్ హెచ్చరికలు!
 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు