/rtv/media/media_files/2025/03/02/cuWAIDbWnimlIOJ1h0lI.jpg)
electrocuted to death Photograph: (electrocuted to death)
ఇనుప నిచ్చెన వారి పాలిట యమపాశంగా మారింది. హైటెన్షన్ వైర్లతో విద్యుత్ షాక్‌కు గురై నలుగురు వ్యక్తులు చనిపోయారు. తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో 10 రోజుల పాటు జరిగే చర్చి ఉత్సవానికి సన్నాహాలు చేస్తుండగా విద్యుత్ షాక్‌తో నలుగురు మరణించారని చెందారు.
Four individuals have tragically lost their lives due to an electric shock in the village of Inaiyamputhenthurai, located in the Kanyakumari district.
— Mahalingam Ponnusamy (@mahajournalist) March 1, 2025
The incident occurred when an iron ladder came into contact with an electric pole while preparations were underway for a temple… pic.twitter.com/vNr6gwAyp1
శనివారం సాయంత్రం ఎనాయం పుతెంతురై సెయింట్ ఆంటోనీ చర్చిలో 9వ రోజు వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్నారు. విజయన్, మనో, జెస్టెస్, శివం అనే నలుగురు వ్యక్తులు రథాన్ని అలంకరించడానికి ఓ పెద్ద ఐరన్ నిచ్చెన ఈడ్చుకొస్తున్నారు. హైటెన్షన్ లైన్ ఉందని వారు గమనించలేదు. దీంతో వైర్లకు నిచ్చెన తగిలి విద్యుత్ షాక్‌తో గిలగిలా కొట్టుకున్నారు. వారి చుట్టుపక్కలున్న మరి కొందరూ వెంటనే అప్రమత్తమై నిచ్చెనకు దూరంగా పరుగులు తీశారు.
Also read: SLBC Tunnel: SLBC టన్నల్ వద్దకు సీఎం రేవంత్ రెడ్డి
ఈ సంఘటన అక్కడున్న కొందరు వీడియో తీశారు. కట్టెల సాయంతో నిచ్చెనను పక్కకు జరిపి వారిని బయటకు తీశారు. అప్పటికే వారు నలుగురు చనిపోయారు. నాలుగు మృతదేహాలను శవపరీక్ష కోసం కులితారై ప్రభుత్వ ఆసుపత్రి, ఆసారిపల్లం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీంతో పండగపూట గ్రామంలో విషాదం నెలకొంది. పుదుకడై పోలీసులు ఈ విషయంపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Also read : Bolivia Bus Crash: ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు బస్సులు ఢీకొని 37 మంది మృతి