Bird Flu: గోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం.. చికెన్‌ తినవద్దని హెచ్చరికలు జారీ

తూర్పుగోదావరి జిల్లాలో బర్డ్‌ఫ్లూతో చనిపోతున్న కోళ్ల సంఖ్య పెరుగుతోంది. దీంతో నెల రోజుల పాటు చికెన్ తినవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రాజమండ్రి కలెక్టరేట్‌లో కమాండ్ కంట్రోల్ రూంలో 9542908025 నెంబర్ ఏర్పాటు చేశారు.

New Update
bird flue

bird flue Photograph: (bird flue)

తూర్పు గోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. బ్లర్డ్‌ ఫ్లూతో చనిపోతున్న కోళ్ల సంఖ్య భారీగా పెరుగుతోంది. పెరవలి మండలం కానూరు గ్రామ పౌల్ట్రీల్లో అధికారులు కొన్ని శాంపిల్స్ తీసుకుని టెస్ట్ చేశారు. వీటిలో శాంపిల్స్ పాజిటివ్‌గా వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో రెడ్ జోన్, సర్వే లెన్స్ జోన్లు ఏర్పాటు చేస్తున్నారు.

ఇది కూడా చూడండి: Maha Kumbh mela: మహా కుంభమేళాకు భారీగా తరలి వచ్చిన భక్తులు...కాశీలోనే ఆంక్షలు విధించిన అధికారులు!

ఇది కూడా చూడండి: Delhi: ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠం పై మగువ...బీజేపీ పెద్ద ప్లానే...నలుగురు ఎమ్మెల్యేలకు అవకాశం...!

నెల రోజుల పాటు చికెన్ తినవద్దని..

నెల రోజుల పాటు ఎవరూ కూడా చికెన్ తినవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అలాగే రాజమండ్రి కలెక్టరేట్‌లో కమాండ్ కంట్రోల్ రూంలో 9542908025 నెంబర్ ఏర్పాటు చేశారు. జిల్లాలో ఎక్కడైనా కూడా బర్డ్స్ ఫ్లూ వల్ల కోళ్లు చనిపోతుంటే మాత్రం వెంటనే పశు సంవర్ధక శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.

ఇది కూడా చూడండి: Uttarakhand:హీరోయిన్‌ను చేస్తామని.. మాజీ సీఎం కుమార్తెనే మోసం చేశారు!

నిడదవోలు, తాడేపల్లిగూడెం, తణుకు, ఉంగుటూరులో ఎక్కువగా బర్డ్ ఫ్లూ ఉంది. ఇప్పటి వరకు గోదావరి జిల్లాల్లో సుమారుగా రెండు లక్షల కోళ్లు మృతి చెందినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే చికెన్ తినడం వల్ల మనుషులకు కూడా బర్డ్ ఫ్లూ సోకే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. చికెన్ అసలు తినవద్దని, దూరంగా ఉండాలని చెబుతున్నారు. ఏ చిన్న లక్షణం కనిపించినా కూడా వెంటనే వైద్యులను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. 

ఇది కూడా చూడండి: Telangana Beers : పెరిగిన బీర్ల ధరలు.. లైట్, స్ట్రాంగ్ ఎంత? .. ప్రభుత్వానికి ఎంత ఆదాయం ?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

విషాదం.. సరదాగా పొలానికి వెళ్లిన చిన్నారి.. ఆ తర్వాత ఏమైందంటే?

కరీంనగర్‌లో సరదాగా అత్తమ్మ ఇంటికి వెళ్లిన ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. అత్తమ్మ వాళ్లు పొలానికి వెళ్తుంటే వారితో సరదాగా వెళ్లి ట్రాక్టర్ తాళాన్ని ఒక్కసారిగా తిప్పింది. ట్రాక్టర్‌తో పాటు చిన్నారి బావిలోకి దూసుకెళ్లడంతో మృతి చెందింది.

New Update
suryapet crime

Crime

సరదాగా అత్తమ్మ ఇంటికి వెళ్లిన ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయిన ఘటన కరీంనగర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఓ మూడేళ్ల చిన్నారి అత్తమ్మ ఇంటికి సరదాగా వెళ్లింది. అత్తమ్మ కుటుంబ సభ్యులు అందరూ కూడా పొలానికి వెళ్తుంటే వారితో సరదాగా వెళ్లింది. అక్కడ ట్రాక్టర్ ఎక్కిస్తే నవ్వుతూ కూర్చొంది.

ఇది కూడా చూడండి: USA: వెనక్కు తగ్గిన ట్రంప్ సర్కార్, చైనా తప్ప మిగతా దేశాలపై 90 రోజుల పాటూ..

ఒక్కసారిగా తాళం తిప్పడంతో..

ఆమెను ట్రాక్టర్ ఎక్కించిన తర్వాత అత్తమ్మ కొడుకును ఎక్కించడానికి పక్కకి వెళ్లారు. ఇంతలో ఆ మూడేళ్ల పాప ట్రాక్టర్ తాళాన్ని ఒక్కసారిగా తిప్పింది. దీంతో ఆ చిన్నారితో పాటు ట్రాక్టర్ బావిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. 

ఇది కూడా చూడండి: Badminton: ఆసియా ఛాంపియన్ షిప్ లో పీవీ సింధు మొదటి విజయం

ఇదిలా ఉండగా ఈమధ్య కాలంలో పెళ్లై పిల్లలు ఉన్న మహిళలు వివాహేతర సంబంధాలతో కట్టుకున్న భర్తలను చంపుతున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌లో ప్రియుడితో కలిసి  కట్టుకున్న భర్తను భార్య కిరాతకంగా చంపిన ఘటన మరువకముందే.. ఆ తరహా ఘటన మరొకటి చోటుచేసుకోవడం కలకలం సృష్టించింది.

ఇది కూడా చూడండి: Sai Sudarshan: చెండాడేశాడు భయ్యా.. చుక్కలు చూపించిన సుదర్శన్- ఎంత స్కోర్ చేశాడంటే?

పోలీసుల వెల్లడించిన వివరాల ప్రకారం రాయ్‌బరేలీలో స్థానికంగా ఉండే ఓ మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. ఇందుకోసం వారు ఓ తుపాకీని కూడా అనంతరం మృతదేహాన్ని సమీపంలోని ఓ పొలంలో పడేసి అక్కడినుంచి వెళ్లిపోయారు.  అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తులో భార్య, ఆమె ప్రియుడు నిందితులని తెలుసుకుని అరెస్టు చేశారు. ఈ కేసును పోలీసులు 12 గంటల్లోనే ఛేదించారు.  

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు