Bihar: సిగరెట్ తీసుకురాలేదని.. 8 ఏళ్ల బాలుడిని దారుణంగా..

సిగరెట్ తీసుకురాలేదని ఎనిమిదేళ్ల బాలుడిని కాల్చి చంపిన ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. చలి కోసం మంటల దగ్గర ఆ బాలుడు ఉన్నాడు. ఇంతలో ఓ రౌడీ షీటర్ సిగరెట్ తెమ్మని డిమాండ్ చేశాడు. బాలుడు నిరాకరించడంతో తన పిస్టోల్‌తో కాల్చి చంపాడు.

New Update
Pistol

Pistol Photograph: (Pistol)

బీహార్‌లోని ముంగేర్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గోవింద్‌పూర్‌లోని ఓ ఎనిమిదేళ్ల కుర్రాడుని దారుణంగా కాల్చి చంపాడు. అన్షు కుమార్ చలి కోసం ఏర్పాటు చేసిన మంటల దగ్గర ఉన్నాడు. రౌడీ అయిన నితీష్ కుమార్ అన్షుని షాప్‌కి వెళ్లి సిగరెట్ తీసుకురమ్మని కోరాడు. అయితే చలి వల్ల అన్షు సిగరెట్ తీసుకురావడానికి నిరాకరించాడు. దీంతో అతని దగ్గర ఉన్న పిస్టల్‌తో ఆ బాలుడిని కాల్చి అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు.

ఇది కూడా చూడండి: Makara Sankranti: సంక్రాంతికి గాలిపటాలు ఎందుకు ఎగరేస్తారో తెలుసా..దాని వెనుక ఉన్న కథేంటంటే!

తలకు బుల్లెట్ తగలడంతో..

బుల్లెట్ శబ్ధం విని కుటుంబ సభ్యులు, ఇతర వ్యక్తులు వచ్చి చూసే సరికి రక్తం మడుగులో ఆ బాలుడు ఉన్నాడు. వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ఉన్నత ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో చికిత్స తీసుకుంటూనే ఆ బాలుడు మరణించాడు. తలకు బుల్లెట్ తగలడం వల్ల మరణించినట్లు వైద్యులు తెలిపారు. 

ఇది కూడా చూడండి: అస్సాం బొగ్గు గని ప్రమాదం.. ముగ్గురు మృతి

ఇదిలా ఉండగా.. ఏపీలో మద్యం మత్తులో తల్లీ కూతుర్ని దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన పులివెందుల నియోజకవర్గంలో జరిగింది. వివరలోకి వెళ్తే.. తొండూరు మండలం తుమ్మలపల్లిలో గంగాధర్‌రెడ్డి.. భార్య, కూతురు నివాసం ఉంటున్నారు. అయితే సోమవారం రాత్రి ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ.. గంగాధర్‌రెడ్డి ఫుల్ల్‌గా తాగి ఇంటికి వచ్చాడు. అనంతరం భార్య శ్రీలక్ష్మీ, కుమార్తె గంగోత్రిని కొడవలితో నరికి చంపి పారిపోయాడు. స్థానికులు శ్రీలక్ష్మీ, గంగోత్రి మృతి చెందిన విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. అనంతరం సంఘటనా స్థలానికి చేరుకున్నారు

ఇది కూడా చూడండి:  ప్లీజ్.. ఆ వీడియోను తొలిగించండి :  కోర్టు మెట్లెక్కిన రమ్య

ఇది కూడా చూడండి: Home Tips: వంటగది సింక్ జామ్‌ అయితే ఇలా చేయండి

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Hyderabad : మరో అమ్మాయితో లవర్ పెళ్లి.. బాత్రూమ్ లోకి వెళ్లి..!

ప్రేమించిన యువకుడు మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని మనస్తాపానికి గురైన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన సరూర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది.  తన చావుకు కారణం 9 మంది అని, వారి పేర్లు మెసేజ్‌ పెట్టినట్లు తెలిపింది.

New Update
mallishwari

mallishwari

ప్రేమించిన యువకుడు మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని మనస్తాపానికి గురైన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన సరూర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. వివారల్లోకి వెళ్తే..  మిర్యాలగూడ బొక్కనుంతలపాడు గ్రామానికి చెందిన మల్లీశ్వరి నిమ్స్‌ ఆసుపత్రిలో స్టాఫ్‌ నర్సుగా పనిచేస్తు్ంది.  మధురపురి కాలనీలోని హాస్టల్‌లో ఉంటుంది. అయితే గత కొన్నేళ్లుగా ఆమె అదే గ్రామానికి చెందిన జానారెడ్డితో ప్రేమలో ఉంది. అయితే మల్లీశ్వరి కులం వేరే కావడంతో జానారెడ్డి కుటుంబ సభ్యులు పెళ్లికి ఒప్పుకోలేదు.

Also read :  TG 10th Results: తెలంగాణ టెన్త్‌ ఫలితాలపై బిగ్‌ అప్‌డేట్‌.. అది తేలితేనే ఫలితాలు !

Also read : Zaheer Khan: పెళ్లైన ఎనిమిదేళ్లకు గుడ్ న్యూస్.. తండ్రైన జహీర్ ఖాన్!

మల్లీశ్వరి కులం వేరే కావడంతో

 దీనికి తోడు ఇటీవల జానారెడ్డికి మరో యువతితో పెళ్లి జరిగింది. ఈ విషయం తెలుసుకున్న మల్లీశ్వరి తాను ఉంటున్న  హాస్టల్ లో మత్తు ఇంజెక్షన్‌ తీసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.  తన చావుకు కారణం 9 మంది అని, వారి పేర్లు మెసేజ్‌ పెట్టినట్లు తెలిపింది. మల్లీశ్వరి స్వగ్రామమైన బొక్కమంతలపాడుకు మృతదేహాన్ని తరలించి ఆమె మృతికి కారణమైన జాన్ రెడ్డి ఇంటి ముందు మృతదేహాన్ని ఉంచి న్యాయం చేయాలంటూ సోమవారం అర్ధరాత్రి దాటేవరకు ధర్నా నిర్వహించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు  నిందితుడు జానారెడ్డిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. 

Also read :  Teeth Brush: ప్రతిరోజూ సరిగ్గా పళ్లు తోముకోకపోతే ఈ 5 ప్రాణాంతక వ్యాధులు వస్తాయి

Also read :  పెళ్లై రెండేళ్లైనా.. విశాఖలో గర్భిణి దారుణ హత్య కేసులో సంచలన విషయాలు!

Advertisment
Advertisment
Advertisment