/rtv/media/media_files/2025/04/02/a2eKNSERfX8JkEWGDgj4.jpg)
women-kids
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో విషాదం చోటుచేసుకున్న ఘటనలో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ప్రియుడి కోసమే ముగ్గురు పిల్లలకు విషమిచ్చి కన్న తల్లే చంపేసిందని పోలీసుల విచారణలో తేలింది. భర్తను కూడా హత్య చేయాలనుకుంది ఈ ఘాతకురాలు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వాటర్ ట్యాంకర్ డ్రైవర్గా పనిచేస్తోన్న చెన్నయ్య (40), లావణ్య (38) దంపతులకు ముగ్గురు పిల్లలున్నారు. లావణ్య ఓ స్కూల్ లో టీచర్ గా పనిచేస్తుంది. అయితే ఇటీవల జరిగిన పదో తరగతి గెట్ టు గెదర్ పార్టీలో పాత స్నేహితుడితో లావణ్యకు కనెక్షన్ కుదిరింది.
Also read : KPHB : భర్త, మరిది టార్చర్ భరించలేక వివాహిత సూసైడ్!
వివాహేతర సంబంధానికి దారి
ఇది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. దీంతో అతడితో కలిసి ఉండాలని లావణ్య స్కెచ్ వేసింది. భర్త,పిల్లల్ని చంపేసి లవర్ తో ఎంజాయ్ చేయాలని అనుకుంది. ప్లాన్ లో భాగంగా మార్చి 27 రాత్రి అందరూ కలిసి పప్పు, పెరుగుతో భోజనం చేశారు. అయితే రజిత పిల్లలకు పెరుగులో విషం కలిపింది. భర్త చెన్నయ్య మాత్రం పప్పుతో మాత్రమే తిని పనికోసం బయటకు వెళ్లాడు. రాత్రి 11 గంటలకు చెన్నయ్య వచ్చి చూసేసరికి పిల్లలు ముగ్గురు విగత జీవులుగా పడి ఉన్నారు. రజిత మాత్రం కడుపు నొప్పిగా ఉందంటూ నాటకం ఆడింది రజిత. వెంటనే ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. ముందుగా మహిళ భర్త చెన్నయ్యను అనుమానించిన పోలీసులు చివరికి తల్లే హంతకురాలిని తేల్చారు. రజిత ప్రియుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Also read : వాళ్లు విడాకులు తీసుకుంటే నన్నేందుకు లాగుతున్నారు : దివ్యభారతి