/rtv/media/media_files/2025/04/02/jqOHApvTBQChvKDzew3s.jpg)
ameernpur-incident
వివాహేతర సంబంధాల మోజులో పడి మనుషులు మానవత్వాన్ని కోల్పోతున్నారు. కట్టుకున్న భర్తలను, భార్యలను చంపేందుకు కూడా వెనుకాడటం లేదు. చివరికి పిల్లల్ని కూడా చంపడానికి సిద్దమవుతున్నారు. శారీరకం సుఖం ముందు కట్టుకున్న మొగుడు, కన్న పిల్లలు, రక్త సంబంధాలు చిన్నవైపోతున్నాయి. తాజాగా సంగారెడ్డిలో రజిత అలియాస్ లావణ్య కేసు రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మీన్‌పూర్ మున్సిపాలిటీ రాఘవేంద్ర కాలనీలో అవురిజింతల చెన్నయ్య.. భార్య రజిత అలియాస్లావణ్య కాపురం ఉంటున్నారు. వీరికి సాయికృష్ణ (12), మధుప్రియ (10), గౌతమ్(8) ముగ్గురు పిల్లలున్నారు. చెన్నయ్య మొదటి భార్య చనిపోవడంతో లావణ్యను రెండో పెండ్లి చేసుకున్నాడు. రజిత స్థానికంగా ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్‌గా పనిచేస్తోంది. మంచిగా సాగుతోన్న ఈ సంసారంలో వివాహేతర సంబంధం చిచ్చు పెట్టింది. పచ్చటి సంసారంలో నిప్పులు పోసి తగ్గలబెట్టేసింది.
ప్రియుడి మోజులో
ఇటీవల జరిగిన పదో తరగతి గెట్ టు గెదర్ పార్టీలో పాత స్నేహితుడు లావణ్యకు పరిచయం అయ్యాడు. నెంబర్స్ మార్చుకుని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. దీంతో ఇది వివాహేతర సంబంధానికి దారి తీసింది. ప్రియుడి మోజులో బాగా మునిగి తేలిన రజితకు భర్త, పిల్లలపై ప్రేమ పూర్తిగా తగ్గిపోయింది. ప్రియుడితోనే ఉండాలనుకుంది. దీనికోసం భర్త, పిల్లలను దూరం చేయాలనుకుంది.
ప్లాన్ లో భాగంగా మార్చి 27 రాత్రి అందరూ కలిసి పప్పు, పెరుగుతో భోజనం చేశారు. అయితే రజిత పెరుగులో విషం కలిపింది. పిల్లలకు పెరుగుతో అన్నం పెట్టింది. భర్త చెన్నయ్య మాత్రం పప్పుతో మాత్రమే తిని ఫోన్ రావడంతో పనికోసం బయటకు వెళ్లాడు. రాత్రి 11 గంటలకు వచ్చి చూసేసరికి పిల్లలు ముగ్గురు విగత జీవులుగా పడి ఉన్నారు. రజిత మాత్రం కడుపు నొప్పిగా ఉందంటూ నాటకం ఆడింది రజిత. వెంటనే ఆమెను ఆసుపత్రిలో చేర్చారు చెన్నయ్య . ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. ముందుగా మహిళ భర్త చెన్నయ్యను అనుమానించిన పోలీసులు చివరికి తల్లే హంతకురాలిని తేల్చారు. రజిత ఆమె ప్రియుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
also read : Teacher crime: ముద్దులు పెడుతూ డబ్బులు వసూలు.. లేడీ టీచర్ అరాచకాలు!