/rtv/media/media_files/2026/02/14/married-lover-2026-02-14-08-00-51.jpg)
లవర్స్ డే రోజు ఓ ప్రేమకథలో చోటుచేసుకున్న విషాదం వెలుగు చూసింది. ఆ లవ్ స్టోరీ సోషల్ మీడియాలో స్టార్ట్ అయి.. తర్వాత జరిగిన షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. మధ్యప్రదేశ్ భోపాల్(bhopal) కు చెందిన సమీర్ ఇన్స్టాగ్రామ్(Instagram Love Story Incident) లో 33ఏళ్ల మహిళ(Married Lover) తో పరిచయం పెంచుకున్నాడు. ఆ పరిచయం కాస్త పేమగా మారింది. ఇది సంవత్సరం క్రితం జరిగింది. కట్ చేస్తే ఇప్పుడు ఆ మహిళ డెడ్‌బాడీ సమీర్ ఇంట్లోని సెప్టిక్ ట్యాంక్‌లో పోలీసులకు దొరికింది.
Also Read : మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస.. రెండు ఇళ్లను తగలబెట్టిన ఆందోళన కారులు
ఇన్స్టాగ్రామ్ పరిచయం.. చివరకు ప్రాణం తీసింది
మహారాష్ట్రలోని గోండియా జిల్లాకు చెందిన 33 ఏళ్ల అష్రఫీ (అలియాస్ సియా)కు, భోపాల్‌కు చెందిన సమీర్ అనే వ్యక్తితో ఏడాది క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం ఏర్పడింది. సమీర్‌కు అప్పటికే వివాహం జరిగి పిల్లలు కూడా ఉన్నారు. అయినప్పటికీ, వీరిద్దరి మధ్య స్నేహం కాస్తా ప్రేమగా మారింది. సమీర్‌పై ఉన్న నమ్మకంతో అష్రఫీ మూడు నెలల క్రితం తన సొంత ఊరిని వదిలి భోపాల్‌కు వచ్చేసింది. నిషాత్‌పురాలో సమీర్ భార్యాపిల్లలతో కలిసి ఉంటున్న అష్రఫీ, కొద్దిరోజుల తర్వాత అతడిని పెళ్లి చేసుకోవాలని ఆమె ఒత్తిడి తెచ్చింది. సమీర్ భార్య, అష్రఫీకి తరుచూ గొడవలు జరిగాయి. సవితి(అష్రఫీ) పోరు పడలేక సమీర్ భార్య పుట్టింటికి వెళ్లింది. 2026 ఫిబ్రవరి మొదటి వారంలో సమీర్, అష్రఫీ మధ్య వివాదం తలెత్తింది. ఈ గొడవ తీవ్రం కావడంతో ఆవేశానికి లోనైన సమీర్, అష్రఫీని గొంతు నులిమి హత్య చేశాడు.
హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని ఎవరికీ తెలియకుండా దాచాలని నిర్ణయించుకున్నాడు. మృతదేహాన్ని ఒక పెద్ద ఇనుప పెట్టెలో కుక్కాడు. ఆ పెట్టెను తన ఇంటి ఆవరణలోని సెప్టిక్ ట్యాంక్‌లో పడేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా పైన సిమెంట్ స్లాబ్‌ను కూడా వేయించాడు.
Also Read : స్టాలిన్ సంచలన నిర్ణయం.. మహిళల ఖాతాల్లోకి రూ.5 వేలు
కుటుంబ సభ్యుల సహకారం పోలీసుల దర్యాప్తు
అష్రఫీ కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన పోలీసులు సమీర్ ఇంటిని తనిఖీ చేశారు. విచారణలో సమీర్ కుటుంబ సభ్యులు పొంతన లేని సమాధానాలు చెప్పడంతో పోలీసులకు అనుమానం బలపడింది. సెప్టిక్ ట్యాంక్‌ను తవ్వి చూడగా, కుళ్ళిపోయిన స్థితిలో ఉన్న అష్రఫీ మృతదేహం లభ్యమైంది. షాకింగ్ విషయం ఏమిటంటే, ఈ హత్యలో సమీర్‌కు అతని తల్లి, అక్క, తమ్ముడు సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. శవాన్ని దాచిపెట్టడంలో, ఆధారాలను రూపుమాపడంలోనూ వారు కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం సమీర్ పరారీలో ఉండగా, పోలీసులు అతని కుటుంబ సభ్యులను అరెస్ట్ చేశారు. సమీర్ అష్రఫీని కోపంలో చంపలేదని, ఇది పక్కా ప్లానింగ్ మర్డర్‌గా పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడు సమీర్ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశాం. సాంకేతిక ఆధారాలతో త్వరలోనే అతడిని పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. ప్రేమ పేరిట మోసపోయి, ప్రాణాలు కోల్పోయిన అష్రఫీ స్టోరీ సోషల్ మీడియా పరిచయాల పట్ల అప్రమత్తంగా ఉండాలని మరోసారి హెచ్చరిస్తోంది.
Follow Us