/rtv/media/media_files/2025/03/29/8LiW4B3TaMDgWimKvyXQ.jpg)
Cricket betting
ఆన్‌లైన్ బెట్టింగ్ బారిన యువత బలి అవుతోంది. వివరాల్లోకి వెళ్తే.. ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్‌లు చేసి అప్పుల తీర్చలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. సుచిత్ర, బీహెచ్‌ఈఎల్ క్వార్టర్స్‌లో రాజ్‌వీర్‌సింగ్ ఠాగూర్ అనే ఓ ప్రైవేట్ ఉద్యోగి ఉంటున్నాడు.
ఇది కూడా చూడండి: Kerala: మీరు సరిగా పని చేయడం లేదు..కుక్కల్లాగా నడవండి..ఉద్యోగులకు వేధింపులు!
అప్పులు కట్టలేక..
చిన్నతనంలోనే రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులు చనిపోవడంతో నానమ్మ, చిన్నాన్నలు పెంచారు. అయితే గత కొన్ని రోజుల నుంచి ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్, మద్యానికి బాగా అలవాటు పడ్డాడు. వీటి కోసం డబ్బులు బాగా అప్పులు చేశాడు. వీటిని తిరిగి చెల్లించలేక అమ్ముగూడ-సనత్‌నగర్ రైల్వేస్టేషన్ గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. వెంటనే పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇది కూడా చూడండి: WhatsApp new features: వాట్సాప్ వీడియో కాల్స్ చేసుకునే వారికి గుడ్‌న్యూస్.. కొత్తగా 3 ఫీచర్లు!
ఇటీవల కామారెడ్డి జిల్లాలో లోన్‌యాప్ ఆగడాలకు మరో యువకుడు బలయ్యాడు. సదాశివనగర్‌లో లోన్‌యాప్ వేధింపులు తట్టుకోలేక సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సందీప్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రూ.15లక్షలు స్టాక్‌మార్కెట్‌లో సందీప్ పెట్టుబడులు పెట్టాడు. స్టాక్ మార్కెట్ నష్టాలతో రూ.15లక్షలు కోల్పోయాడు సందీప్. దీంతో క్రెడిట్ కార్డులు, లోన్ యాప్ ద్వారా 15 లక్షలు అప్పు తీసుకున్నాడు సందీప్.
ఇది కూడా చూడండి: Tractor accident: అదుపుతప్పి బావిలో పడ్డ ట్రాక్టర్.. ఏడుగురు మహిళా కూలీలు మృతి
దీంతో తీసుకున్న అప్పులు తీర్చకపోవడంతో సందీప్‌ను లోన్‌యాప్ ఏజెంట్లు వేధించడం మొదలుపెట్టారు. సందీప్ ఇంటికి లోన్‌యాప్ ఏజెంట్ల వెళ్లి వేధింపులకు గురిచేయడంతో మనస్తాపం చెందాడు. దీంతో ఇంట్లో ఎవరూ లేని టైమ్ చూసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా సందీప్ కు ఐదు నెలల క్రితమే సందీప్‌కు వివాహం అయింది. దీంతో సందీప్ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇది కూడా చూడండి: USA: సగానికి పైగా విద్యార్థి వీసాల్లో కోత..తెలుగు రాష్ట్రాల వారివే ఎక్కువ