/rtv/media/media_files/2025/03/31/pQqcfMU7NYzKdgRNE4uk.jpg)
Annamayya Crime Photograph: (Annamayya Crime)
అన్నమయ్య జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మేత కోసం వెళ్లిన 65 మూగజీవాలు కొండపై మృతి చెందాయి. వివరాల్లోకి వెళ్తే.. అన్నమయ్య జిల్లా ములకలచెరువు మండలంలోని దేవుళచెరువు పంచాయతీ వసంతరాయుని పల్లెలో శ్రీరాములు అనే వ్యక్తి గొర్రెలు మేపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రోజూ లాగానే ఆదివారం నాడు మేత కోసం 122 గొర్రెలను సమీపంలోని సంద్రకొండకు తీసుకెళ్లాడు.
ఇది కూడా చూడండి: Actress Abhinaya: హీరో కాదు బిజినెస్ మ్యాన్.. కాబోయే భర్తను పరిచయం చేసిన అభినయ!
మంటల్లో కొన్ని గొర్రెలు..
గొర్రెలు మేస్తుండగా.. కొండ వెనుక వైపు నుంచి కొందరు నిప్పు పెట్టారు. దీంతో కొన్ని నిమిషాల వ్యవధిలోనే కొండ చుట్టూ మంటలు వ్యాపించాయి. ఇంతలో గొర్రెల కాపారి వాటిని కాపాడే ప్రయత్నం చేసినా కూడా ఫలితం లేకపోయింది. అన్ని గొర్రెలను చూసుకోవడం తన కాకపోయే సరికి గ్రామస్థులకు సమాచారం ఇచ్చాడు. కానీ ఇంతలోనే 65 మూగ జీవాలు మంటలకు ఆహుతి అయ్యాయి. మిగతా గొర్రెలు కూడా తీవ్రంగా గాయపడ్డాయి.
ఇది కూడా చూడండి: Sikandar Collections: సల్మాన్ ఖాన్ కి పైరసీ దెబ్బ.. తొలిరోజు ఎంత వసూలు చేసిందంటే
ఇదిలా ఉండగా ఇటీవల హిమాచల్ ప్రదేశ్ లోనీ కులు లో కొండ చరియలు విరిగి పడి ఆరుగురు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. హిమాచల్ ప్రదేశ్ కులులోని గురుద్వారా మణికరణ్ సాహిబ్ ఎదురుగా ఉన్న పిడబ్ల్యుడి రోడ్డు సమీపంలో ఆదివారం సాయంత్రం కొండచరియలు విరిగిపడడంతో ఈ ప్రమాదం జరిగింది.
ఇది కూడా చూడండి: Kumar Sangakkara : 51 ఏళ్ల బ్యూటీతో 47 ఏళ్ల కుమార సంగక్కర డేటింగ్!
మరణించిన ఆరుగురిలో ముగ్గురు మహిళలు ఉన్నారు. ఈ సంఘటనలో అనేక మంది గాయపడ్డారు. దీంతో పాటు ఆరుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది.