/rtv/media/media_files/2025/02/11/3WS8OY04gyodnPdXIp12.jpg)
Kakinada Photograph: (Kakinada)
ఏపీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కాకినాడ జిల్లా (Kakinada District) లోని రంగరాయ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ స్టూడెంట్ ( ) హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ యువకుడు గదిలోపలికి వెళ్లి ఎంత సమయమైన బయటకు రాలేదు. దీంతో తోటి విద్యార్థులు తలుపులు బద్దలు కొట్టగా.. ఫ్యాన్‌కు ఉరి వేసుకుని విగత జీవిగా కనిపించాడు.
ఇది కూడా చూడండి: Uttarakhand:హీరోయిన్‌ను చేస్తామని.. మాజీ సీఎం కుమార్తెనే మోసం చేశారు!
కాకినాడలో మెడికల్ విద్యార్థి ఆత్మహత్య
— greatandhra (@greatandhranews) February 11, 2025
రంగరాయ మెడికల్ కాలేజీలో రెండో సంవత్సరం చదువుతున్న సాయిరాం pic.twitter.com/xorRsEUNOr
ఇది కూడా చూడండి: Delhi: ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠం పై మగువ...బీజేపీ పెద్ద ప్లానే...నలుగురు ఎమ్మెల్యేలకు అవకాశం...!
కొడుకు మరణంతో కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రులు
హాస్టల్ సిబ్బంది వెంటనే తల్లిదండ్రులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోషించాల్సిన కుమారుడు మరణించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇది కూడా చూడండి: Telangana Beers : పెరిగిన బీర్ల ధరలు.. లైట్, స్ట్రాంగ్ ఎంత? .. ప్రభుత్వానికి ఎంత ఆదాయం ?
ఇదిలా ఉండగా ఇటీవల తెలంగాణలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకుంది. ఫోన్ చూడొద్దమ్మ అని తల్లి మందలించినందుకు పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన తెలంగాణలోని కుమురం భీం జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కుమురం భీం జిల్లా కౌటాల మండల కేంద్రానికి చెందిన 16 ఏళ్ల బాలిక ప్రైవేట్ స్కూల్లో పదోతరగతి చదువుతోంది. అయితే కాగజ్‌నగర్ పట్టణంలో శనివారం నవోదయ ప్రవేశపరీక్షకు హాజరైంది. అనంతరం ఇంటికి వచ్చి స్టడీ మెటీరియల్ పీడీఎఫ్ జిరాక్స్ తీసుకుంటానని మొబైల్ అడిగింది. తల్లి తానే జిరాక్స్ తీసుకొస్తానని చెప్పడంతో ఆత్మహత్య చేసుకుంది.
ఇది కూడా చూడండి: Maha Kumbh mela: మహా కుంభమేళాకు భారీగా తరలి వచ్చిన భక్తులు...కాశీలోనే ఆంక్షలు విధించిన అధికారులు!