/rtv/media/media_files/2025/01/26/Pxkv7QDTLrYg5EwqnpU7.jpg)
girl killed Photograph: (girl killed)
మేడపై చదువుతున్న పదవ తరగతి బాలికపై కోతులు దాడి చేశాయి. భయంతో మేడ అంచుకు వెళ్లిన బాలికను ఓ కోతి కిందకి తోసేసింది. కింద పడిన ఆమె తీవ్రంగా గాయపడింది. ఆసుపత్రికి తరలించగా ఆ విద్యార్థిని అప్పటికే మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. బీహార్‌లోని సివాన్ జిల్లాలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. పదో తరగతి చదువుతున్న ప్రియా ఒంటరిగా ఇంటి మేడపై చదువుకొంటున్నది. కోతుల సమూహం ఇంటి మేడపైకి వచ్చాయి.
ఇది కూడా చదవండి : సైఫ్ అలీ ఖాన్ కత్తిపోటు కేసుపై RGV సంచలన ట్వీట్!
ప్రియ చుట్టూ చేరి.. కోతులు బాలికపై దాడి చేశాయి. భయంతో ప్రియా ఆ కోతుల బారి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించింది. అందులో ఓ కోతి ప్రియ మీదికి దూకి మిద్దెపై నుంచి తోసేసింది. దీంతో ఆమె కిందపడి తీవ్రంగా గాయపడింది. కుటుంబ సభ్యులు ఆ బాలికను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ప్రియా మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. కోతి తోసేయడంతో మరణించిన ప్రియా మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించేందుకు ఆమె ఫ్యామిలీ నిరాకరించిందని పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి: Johny master : జానీ మాస్టర్ పై కేసు.. తొలిసారి నోరు విప్పిన కొరియోగ్రాఫర్.. సంచలన ఇంటర్వ్యూ!