/rtv/media/media_files/2025/02/28/M4OovwCYOn58oZJDSgvp.jpg)
madhyapradesh minor girl Photograph: (madhyapradesh minor girl)
మధ్య ప్రదేశ్ గ్వాలియర్‌లో అమానవీయ ఘటన వెలుగు చేసింది. ఓ మైనర్ బాలుడు కిరాతకంగా ఐదేళ్ల బాలికపై లైంగిక దాడి చేసి చంపాలని చూశాడు. నిందితుడు బాలికను ఒక పాడుబడిన ఇంటికి తీసుకెళ్లి, అత్యాచారం చేసి చంపడానికి ప్రయత్నించాడు. బాధితురాలు ప్రస్తుతం హాస్పిటల్‌లో ప్రాణాలతో పోరాడుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లో పక్కింట్లో ఉంటున్న 17ఏళ్ల మైనర్ బాలుడు ఐదేళ్ల బాలికను ఫిబ్రవరి 22న ఇంటి పైకప్పు నుంచి బయటకు తీసుకెళ్లాడు. మద్యం మత్తులో ఉన్న బాలుడు సమీపంలోని పాడుబడిన భవనంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి.. బాలికపై విచక్షణారహితంగా దాడి చేసి గాయపరిచాడు. బాలికపై లైంగిక దాడి చేసి, గాయాలు చేయడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది.
Also Read: హైక్లాస్ 5జీ స్మార్ట్‌ఫోన్.. ఫస్ట్ సేల్‌లో భారీ డిస్కౌంట్- డోంట్ మిస్!
అత్యాచారం తర్వాత నిందితుడు బాలిక తలను నేలకేసి కొట్టి చంపడానికి ప్రయత్నించాడు. దీంతో ఆమె తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆ బాలిక ప్రస్తుతం గ్వాలియర్‌లోని ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య పోరాడుతుంది. ఆమె ప్రైవేట్ భాగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని వైద్యులు తెలిపారు. ఆమెకు పెద్ద శస్త్రచికిత్స జరిగింది. ఆమె జననాంగాలకు 28 కుట్లు వేయాల్సి వచ్చింది.
Also Read: ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన 5గురు స్పాట్ డెడ్!
స్పృహలోకి వచ్చిన తర్వాత బాలిక తల్లిదండ్రులకు జరిగిన విషయాన్ని వివరించింది. దీనితో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. కఠిన చర్యలు తీసుకోవాలనే స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. గ్వాలియర్‌కు చెందిన కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఈ సంఘటనను ఖండించారు. జిల్లా యంత్రాంగం మరియు పోలీసులను సంప్రదించి న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు. ఇంతకు తెగించిన నిందితుడిని మైనర్‌గా పరిగణించవద్దని బాధిత కుంటుంబం కోరుతుంది. మరణశిక్ష విధించాలని బాలిక కుటుంబం డిమాండ్ చేసింది.