వీడు తండ్రి కాదు.. రాక్షసుడు.. భార్యతో గొడవ వల్ల 9 నెలల బిడ్డను గొడ్డలితో చంపిన వ్యక్తి

ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్ జిల్లాలో దారుణం జరిగింది. భార్యతో గొడవ జరగడంతో భర్త తన రాక్షసత్వాన్ని చూపించాడు. కన్నతండ్రి అని కూడా చూడకుండా వారి 9 నెలల పసికందును గొడ్డలితో నరికి చంపేశాడు.

New Update
A Man Kills 9-Month-Old Son With Axe During Argument With Wife in Uttarpradesh

A Man Kills 9-Month-Old Son With Axe During Argument With Wife in Uttarpradesh

ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్ జిల్లాలో దారుణం జరిగింది. భార్యతో గొడవ జరగడంతో భర్త తన రాక్షసత్వాన్ని చూపించాడు. కన్నతండ్రి అని కూడా చూడకుండా వారి 9 నెలల పసికందును గొడ్డలితో నరికి చంపేశాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది. ఏప్రిల్ 3న కుద్వార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మాధా గ్రామంలో ఈ దారుణం జరిగింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. 

Also Read: దక్షిణాదిలో లోక్‌సభ సీట్లు తగ్గుతాయా ?.. క్లారిటీ ఇచ్చిన ప్రధాని మోదీ

కుటుంబ గొడవల వల్లే

పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు శంభుద్యాల్ కోరి.. తన భార్య రంజు మధ్య ఓ చిన్న విషయంలో గొడవ జరిగింది. ఈ ఘర్షణ ముదరడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన శంభుద్యాల్ ఆవేశంలో ఇంట్లోని గొడ్డలిని తీసుకున్నాడు. తన ముందు ఉన్న 9 నెలల కొడుకు శివాంశ్‌ను దారుణంగా నరికాడు. దీంతో ఆ పసికందు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కళ్లముందే బిడ్డ ప్రాణాలు పోవడంతో తల్లి అల్లాడిపోయింది. 

Also Read: తమిళనాడులో ఆ పార్టీకే అధికారం.. ప్రీపోల్‌ సర్వేల్లో వెల్లడి

సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడు హత్యకు వాడిన గొడ్డలిని స్వాధీనం చేసుకున్నారు. అయితే నిందితుడు శంభుద్యాల్ మానసిక పరిస్థితి సరిగా లేదని తెలుస్తోంది. దీన్ని నిర్ధారించేందుకు పోలీసులు అతడికి వైద్య పరీక్షలు చేయిస్తామని తెలిపారు. పసికందు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించామని.. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని పేర్కొన్నారు. 

Advertisment
తాజా కథనాలు