/rtv/media/media_files/2025/01/24/WCj1FyO3Vllcy868YabG.webp)
Field Assistant Murder
Field Assistant Murder: కర్నూలు జిల్లా ఆలూరు మండలంలోని అరికెర గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్ పదవి విషయంలో నెలకొన్న వివాదం ఒక ఫీల్డ్ అసిస్టెంట్ హత్యకు దారితీసింది. గ్రామస్తుల తెలిపిన వివరాల ప్రకారం అలూరుకు చెందిన కురువ బండారి ఈరన్న ఉపాధిహామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు. అయితే అ పదవి విషయంలో కొంతకాలంగా గ్రామంలో వివాదాలు జరుగుతున్నాయి. ఆ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న మరికొందరు ఈరన్నను రాజీనామా చేయాలని గత రెండునెలలుగా ఒత్తిడి తీసుకువస్తున్నట్లు తెలిపారు. అయితే ఈరన్న ససేమిరా అనడంతో వివాదం మరింత ముదిరి హత్యకు దారితీసింది.
Also Read: మెగా ఫ్యామిలీలో పెళ్లి భాజాలు.. తేజ్ వెడ్డింగ్ ఫిక్స్ చేసిన మెగాస్టార్!
కాపు కాచి, వేట కొడవళ్లతో నరికి..
కురువ బండారి ఈరన్న శుక్రవారం ఉదయం ఉపాధి పనులు చేయించేందుకు వెళుతుండగా కాపు కాచి ప్రత్యర్థులు వేట కొడవళ్లతో నరికి చంపారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా గత కొంత కాలంగా ఈరన్నను ఉద్యోగానికి రాజీనామా చేయాలని బెదిరస్తున్న వ్యక్తులే ఆయనను హత్య చేసి ఉంటారని కుటుంబసభ్యులు, గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేశారు. నిందితులను గుర్తించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read: నీయవ్వ తగ్గేదేలే.. జాన్వీ కపూర్‌కు దేవిశ్రీ ప్రసాద్ బంపరాఫర్!
కాగా ఈరన్న హత్య విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు సద్దుమణిగేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు అవసరమైన చర్యలు చేపట్టారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.
Also Read: తెలంగాణలో మేఘా పెట్టుబడుల వెనుక సీక్రెట్ ఇదే.. అసలు బాగోతం బయటపెట్టిన బీజేపీ ఎమ్మెల్యే!
Also Read: భలే ఛాన్స్ మిస్.. విశ్వనాథ్ బ్లాక్ బస్టర్ సినిమాను రిజెక్ట్ చేసిన హీరోయిన్!