/rtv/media/media_files/2026/04/05/3-year-old-gang-raped-by-uncle-and-his-friends-2026-04-05-21-46-04.jpg)
3 year old gang raped by uncle and his friends
బిహార్ రాజధాని పాట్నాలో దారుణ సంఘటన వెలుగుచూసింది. డ్రగ్స్‌కు బానిసైన ఓ 22 ఏళ్ల యువకుడు.. తన మూడేళ్ల సొంత మేనకోడలిని స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక అరుపులు విన్న స్థానికులు అక్కడికి రావడంతో నిందితులు భయంతో అక్కడి నుంచి పారిపోయారు. తీవ్ర రక్త స్రావంతో ఉన్న చిన్నారిని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఈ అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Also Read: భర్తను చంపి తగులబెట్టిన భార్య.. గుట్టురట్టు చేసిన క్యూఆర్ కోడ్!
నిందితుడి మేనకోడలు నిద్రిస్తుండగా తన ఇద్దరు స్నేహితులతో కలిసి సమీప పొలాల్లోకి ఎత్తుకెళ్లాడు. అక్కడ వీళ్లు ఆ చిన్నారిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రస్తుతం ఆ చిన్నారికి ఆస్పత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడైన బాధితురాలి మేనమామతో పాటు మరో వ్యక్తిని అరెస్టు చేశారు.
Also Read: విడాకులు తీసుకున్న కూతురు.. గ్రాండ్‌గా సెలబ్రేషన్స్ చేసిన పేరెంట్స్
పరారీలో ఉన్న మూడో నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఘటనాస్థలంలో ఫోరెన్సిక్ టీమ్ ఆధారాలు సేకరించినట్లు పోలీసులు తెలిపారు. నిందితులకు కఠినంగా శిక్ష పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ చేయిస్తామని తెలిపారు. మరోవైపు చిన్నారిపై సామూహిక అత్యాచారం జరగడం స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ ఘాతుకానికి పాల్పడ్డ నిందితులను కఠినంగా శిక్షించాలంటూ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Follow Us