/rtv/media/media_files/2025/04/13/X9m6ezRFc6iX3RGHbk2m.jpg)
Accident
Accident: నేపాల్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు జీపు అదుపుతప్పి 700 మీటర్ల లోయలో పడింది. ఈ విషాద ఘటనలో అందులో ప్రయాణిస్తున్న 17 మంది ప్రాణాలు కోల్పోయారు. రోల్పా జిల్లాలోని పర్వత ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. జల్‌జలాలోని వైశఖ పౌర్ణమి వేడుకలకు స్థానికులు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. భారీ వర్షం వల్ల బురద ఏర్పడటంతో ఆ వాహనం జారి పడ్డట్లు పోలీసులు తెలిపారు. ప్రతికూల వాతావరణంలో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని పేర్కొన్నారు. సమాచారం మేరకు ఘటనాస్థలానికి పోలీసులు, సహాయక బృందాలు చేరుకున్నాయి. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: చైనాలో కుదేలైన రియల్ ఎస్టేట్.. కారణం ఏంటి? భారత్ పై ఎఫెక్ట్ ఉంటుందా?
అయితే ఆ ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోయలో ప్రతికూల పరిస్థితులు వల్ల మృతదేహాలు వెలికితీసేందుకు అధికారుల చర్యలకు ఆటంకాలు కలుగుతున్నాయి. ప్రస్తుతం నేపాల్‌లోని కొండ ప్రాంతాల్లో రోడ్ల పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. తరచుగా ఆయా ప్రాంతాల్లో ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు వాపోతున్నారు.
Also Read: ఇరాన్‌పై దాడులు చేయొద్దు.. ట్రంప్‌కు పుతిన్ సంచలన వార్నింగ్
Follow Us