Drugs: ఛీ..ఛీ.. వీళ్లు తల్లిదండ్రులేనా.. డ్రగ్స్ కోసం బిడ్డల్ని అమ్ముకున్నారు..

మహారాష్ట్రలోని ముంబయిలో డ్రగ్స్‌కు బానిసైన దంపతులు తమ రెండేళ్ల కొడుకు, నెల రోజుల వయసున్న పసిపాపను అమ్ముకున్నారు. వీరి కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ దంపతులను, పసిపాపను కొనుక్కున్న వ్యక్తిని, డ్రగ్స్ ఏజెంట్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

New Update
Drugs: ఛీ..ఛీ.. వీళ్లు తల్లిదండ్రులేనా.. డ్రగ్స్ కోసం బిడ్డల్ని అమ్ముకున్నారు..

మహారాష్ట్రలోని ముంబయిలో అమానుష సంఘటన జరిగింది. డ్రగ్స్‌కు బానిసైపోయినటువంటి దంపతులు వాటిని కొనుక్కొనేందుకు ఏకంగా తమ పిల్లలనే అమ్ముకోవడం కలకలం రేపింది. రెండేళ్ల కుమారుడితో సహా.. నెల రోజుల కిందట జన్మించిన బిడ్డను అమ్ముకున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న వారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. షబ్బీర్‌ ఖాన్, అతని భార్య సానియా ముంబైలో నివసిస్తున్నారు. అయితే వీరిద్దరు డ్రగ్స్‌కు అలవాటుపడిపోయారు. ఆ డ్రగ్స్ కొనుక్కునేందుకు ముందుగా తమ రెండేళ్ల కుమారుడ్ని రూ. 60 వేలకు అమ్ముకున్నారు. మరో విషయం ఏంటంటే నెల రోజల క్రితమే వారికి ఓ పాప జన్మిచ్చింది. ఇప్పుడు ఆ చిన్నారిని కడా విక్రయించారు.

Also Read: మెట్రో ఎక్కిన కేటీఆర్‌.. ప్రచారం చేసిన మంత్రి!

ఈ విషయం షబ్బీర్‌ ఖాన్ సోదరి అయిన రుబీనాకు ఈ సమాచారం తెలిసింది. దీంతో వారికి ఆగ్రహం వ్యక్తం చేసిన రుబీనా.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దంపతులపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అనంతరం షబ్బీర్‌ ఖాన్, అతని భార్య సానియా ఖాన్‌తో పాటు పసిబిడ్డను కొనుక్కున్న షకిల్ మక్రానీ.. అలాగే డ్రగ్స్ ఏజెంట్ ఉషా రాథోడ్‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. చివరికి శుక్రవారం అంధేరీ ప్రాంతం నుంచి నెల రోజుల ఆ పసిపాపను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ఆ దంపతులు మొదటగా అమ్మేసిన రెండేళ్ల కుమారుడి ఆచూకీ కోసం దర్యాప్తు ప్రారంభించారు. ఆ బాలుడ్ని కొన్న వారి గురించి ఆరా తీస్తున్నారు. త్వరలోనే ఆ బాలుడిని ఆచూకీ కూడా కనిపెడతామని పోలీసులు తెలిపారు.

Also Read: ఉత్తరాఖండ్‌ టన్నెల్‌ ప్రమాదం.. సాయంత్రం నాటికి కార్మికులు బయటకు వచ్చే ఛాన్స్..

Advertisment
Advertisment
తాజా కథనాలు