Cops: పోలీసులకు అర్చకుల వేషాధారణ.. వివాదంలో బీజేపీ సర్కార్‌

యూపీలోని వారణాసిలో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం కాశీ విశ్వనాథ ఆలయంలో విధులు నిర్వహించే పోలీసులకు యోగీ ఆదిత్యనాథ్ సర్కార్‌ కొత్త డ్రెస్‌కోడ్‌ను ప్రకటించింది. దీంతో వారు ఖాకీ దుస్తుల్లో కాకుండా ధోతీ-కుర్తాలతో అర్చకుల వస్త్రాధారణలో కనిపించడం వివాదస్పదమైంది.

New Update
Cops: పోలీసులకు అర్చకుల వేషాధారణ.. వివాదంలో బీజేపీ సర్కార్‌

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం కాశీ విశ్వనాథ ఆలయంలో నిత్యం భక్తులతో సందడి వాతావరణం ఉంటుంది. అయితే అక్కడ విధులు నిర్వహించే పోలీసులకు యూపీ సర్కార్‌ కొత్త డ్రెస్‌కోడ్‌ను ప్రకటించింది. ఇప్పటినుంచి వారు ఖాకీ దుస్తుల్లో కాకుండా.. సంప్రదాయ దుస్తుల్లో విధులు నిర్వహిస్తారని పేర్కొంది. ఇందుకు సంబంధించి వారణాసి పోలీస్‌ కమిషనర్‌ మోహిత్‌ అగర్వాల్ ఆదేశాలు జారీ చేశారు.

Also Read:ప్రకటనలు చూసి ప్రోటీన్ పౌడర్లను వాడేస్తున్నారా? ఆరోగ్యం పాడైపోవడం ఖాయం!!

కాశీ విశ్వనాథ ఆలయ ప్రాంగణం వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసులు ధోతీ-కుర్తా, మెడలో రుద్రాక్ష మాలతో అర్చకుల వస్త్రధారణలో కనపించారు. ఈ ఫొటోలు వైరల్‌ కావడంతో.. యోగీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వివాదస్పదమైంది. మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసులు అర్చకుల లాగా డ్రెస్ కోడ్ వేసుకోవాలని ఏ పోలీస్‌ మ్యానువల్‌లో ఉందంటూ ప్రశ్నించారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని.. ఈ ఉత్తర్వులు జారీ చేసిన వారిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఎవరైనా రేపు దీన్ని అవకాశంగా తీసుకోని భక్తులపై మోసాలకు పాల్పడితే.. యూపీ ప్రభుత్వం ఏ సమాధానం చెబుతుంది అంటూ ప్రశ్నించారు. మరోవైపు సోషల్ మీడియాలో కూడా యోగీ ప్రభుత్వంపై నెటీజన్లు విమర్శలు చేస్తున్నారు.

అయితే ఈ నిర్ణయాన్ని కమిషనర్ మోహిత్ అగర్వాల్ సమర్థించుకున్నారు. 'ఆలయ ప్రాంగణంలో విధి నిర్వహణ మిగతా ప్రాంతాలతో పోల్చుకుంటే భిన్నంగా ఉంటుంది. భక్తులకు త్వరగా దర్శనం కల్పించే క్రమంలో కొన్నిసార్లు పోలీసుల తీరు భక్తులకు భాద కలిగించవచ్చు. వాళ్లు అర్చకుల లాగా కనిపిస్తే.. భక్తులు సానుకూల కోణంలో ఆలోచించే అవకాశం ఉంటుంది. అందుకే డ్రెస్‌ కోడ్‌ మార్చామంటూ' మోహిత్ అగర్వాల్ తెలిపారు.

Also Read: అక్రమ వలసదారుల పై బ్రిటన్‌ ఉక్కుపాదం.. 12 మంది భారతీయుల అరెస్ట్‌!

Advertisment
Advertisment
తాజా కథనాలు