Lemon: నిమ్మకాయను ఎక్కువగా తీసుకుంటే ఈ సమస్యలు తప్పవు

నిమ్మకాయలో విటమిన్ సి, పొటాషియం, ఫైబర్, ఫోలేట్, కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ వలన దంతక్షయం, దంతాల ఎనామిల్ కూడా కోల్పోయే అవకాశం, జీర్ణ సమస్యలు, ఉబ్బరం, గుండెల్లో మంట కూడా కలుగుతుందని నిపుణులు అంటున్నారు.

New Update
Lemon: నిమ్మకాయను ఎక్కువగా తీసుకుంటే ఈ సమస్యలు తప్పవు

Lemon: చాలా మంది అందం నుండి రోగనిరోధక శక్తిని పెంచడం వరకు నిమ్మకాయలను ఉపయోగిస్తున్నారు. నిమ్మకాయలో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే కొన్ని నష్టాలు కూడా ఉంటాయని నిపుణులు అంటున్నారు. నిమ్మకాయలో విటమిన్ సి, పొటాషియం, ఫైబర్, ఫోలేట్, కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు ఉన్నాయి . ఇవి మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. నిమ్మకాయ ఉపయోగాలపై ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.

జీర్ణక్రియకు మంచిది:

  • నిమ్మకాయలో పెక్టిన్ అనే ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. నిమ్మకాయలోని సిట్రిక్ యాసిడ్ శరీరంలోని అసిడిటీ స్థాయిని నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. వైరస్‌లు, బ్యాక్టీరియాలకు వ్యతిరేకంగా నిమ్మకాయ పనిచేస్తుంది. ఇందులోని విటమిన్‌ సీ కారణంగా రోగ నిరోధకశక్తి పెరుగుతుంది.

    నిమ్మకాయ వల్ల నష్టాలు:

  • నిమ్మకాయ ఆరోగ్యానికి మంచిదే అయినా అతిగా తీసుకోవడం వల్ల కొన్ని దుష్ప్రభావాలుంటాయని నిపుణులు చెబుతున్నారు. నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల దంతక్షయం ఏర్పడుతుంది. ఇంకా దంతాల ఎనామిల్ కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది. దంతాలకే కాదు నిమ్మకాయల వల్ల జీర్ణ సమస్యలు కూడా వస్తాయి. ఎసిడిటీ ఉంటే నిమ్మకాయ తినడం వల్ల ఉబ్బరం, గుండెల్లో మంట కూడా కలుగుతుంది. నిమ్మకాయలో పొటాషియం ఎక్కువగా ఉండటం కారణంగా హార్ట్‌ బీట్‌ కూడా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

అందం విషయం:

  • మొటిమలను పోగొట్టడానికి, చుండ్రును వదిలించుకోవడానికి చాలా మంది నిమ్మకాయను ముఖం, తలకు అప్లై చేస్తారు. అయితే నిమ్మకాయను ఎక్కువగా ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మం పొడిబారుతుంది. దురద, మంట వంటి చర్మ సమస్యలకు కారణం అవుతుంది. అందుకే నిమ్మకాయను నేరుగా ముఖానికి రాసుకోకూడదని వైద్యులు అంటున్నారు. అదేవిధంగా బరువు తగ్గేందుకు కొందరు ఉదయాన్నే ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగుతుంటారు. దీని వల్ల చర్మం చాలా పొడిగా మారుతుంది. అలాగే ఎసిడిటీ వల్ల సమస్యలు వస్తాయి. కాబట్టి అలాంటి అలవాట్లను తగ్గించుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.

నిమ్మకాయను ఉపయోగించేటప్పుడు జాగ్రత్తలు:

  • నిమ్మరసాన్ని ముఖానికి రాసుకునేటప్పుడు అందులో తేమ శాతం ఉన్న మరికొన్ని పదార్థాలను జోడించడం మంచిది. రెండు చుక్కల నిమ్మరసం, కలబంద జెల్ మిక్స్ చేసుకోవాలి. కలబంద చర్మం పొడిబారకుండా చేస్తుంది.

ఇది కూడా చదవండి: ఈ పని చేసి చూడండి..ఆఫీస్‌ వర్క్‌ మెదడుపై ఒత్తిడి చూపదు

గమనిక : ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
తాజా కథనాలు