Telangana: కవితకు నోటీసులు అందుకే పంపారు: జగ్గారెడ్డి

ఈనెల 26న విచారణకు హాజరుకాలేనని కవిత సీబీఐకి లేఖ రాయడంతో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్పందించారు. బీఆర్‌ఎస్, బీజేపీ ఒప్పందంలో భాగంగానే కొత్త నాటకానికి తెరలేపారని విమర్శించారు. కాంగ్రెస్‌ ఓట్లు చీల్చాలనేదే వాళ్ల ఆలోచన అంటూ మండిపడ్డారు.

New Update
Telangana: కవితకు నోటీసులు అందుకే పంపారు: జగ్గారెడ్డి

ఈనెల 26న విచారణకు హాజరుకావాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కవితకు సీబీఐ నోటీసులు పంపగా.. ఈ విచారణకు హాజరుకాలేనని కవిత లేఖ పంపడం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. ఈ నేపథ్యంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ అంశంపై స్పందించారు. బీఆర్ఎస్, బీజేపీలు సిద్దాంతాలు లేను పార్టీలంటూ విమర్శించారు. ఆ రెండు పార్టీలు కూడా అవకాశవాద రాజకీయాలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెక్యులర్ అనే మాటకు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నారు.

Also read: తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌ ఎవరంటే..

ఓట్లు చీల్చడం కోసమే

కిషన్ రెడ్డి, బండి సంజయ్‌ మాటలకు బీజీపీలో విలువ లేదంటూ ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్, బీజేపీ ఒప్పందంలో భాగంగానే కవితకు సీబీఐ నోటీసులు ఇచ్చి.. కొత్త నాటకానికి తెరలేపారని విమర్శించారు. కవితను అరెస్టు చేస్తే సానుభూతి వచ్చి.. ఓట్లు డైవర్ట్‌ అవుతాయని వాళ్ల లెక్క అంటూ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ ఓట్లు చీల్చాలనేదే వాళ్ల ఆలోచన అంటూ మండిపడ్డారు. ఇదిలాఉండగా.. ఈ నెల 26న విచారణకు హాజరుకావాలంటూ ఆమెకు సీబీఐ నోటీసులు జారీ చేయగా.. ముందే నిర్ణయించిన షెడ్యూల్‌ ఉండటంతో రేపటి విచారణకు రాలేనని కవిత తేల్చి చెప్పారు. ఈ మేరకు సీబీఐకి లేఖ రాశారు.

తనకు ఇచ్చిన నోటీసులను ఉపసంహరించుకోవాలని కోరారు. ఏదైన సమాచారం కావాలంటే వర్చువల్‌ విధానంలో హాజరవుతానని స్పష్టం చేశారు. సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద నోటీసులు ఇవ్వడం సరికాదంటూ పేర్కొన్నారు. సీబీఐ చేస్తున్న ఆరోపణల్లో నా పాత్ర లేదని.. ఈ కేసు కోర్టులో పెండింగ్‌లో ఉన్నట్లు చెప్పారు. ఈడీ నోటీసులు జారీ చేయగా తాను సుప్రీం కోర్టుకు వెళ్లానని.. కేసు సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉండటం వల్ల.. తనను విచారణకు పిలవబోమని అదనపు సొలిసిటర్ జనరల్ సుప్రీం కోర్టుకు హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. సుప్రీంకోర్టులో ఇచ్చిన హామీ సీబీఐకి కూడా కూడా వర్తిస్తుందని.. గతంలో కూడా సీబీఐ హైదరాబాద్‌లోని తన నివాసానికి వచ్చినప్పుడు విచారణకు సహకరించినట్లు చెప్పారు. కానీ.. 15 నెలల విరామం తర్వాత విచారణకు పిలవడం, సెక్షన్ల మార్పు వంటివి అనేక అనుమానాలకు తావునిస్తోందని ఆరోపిస్తున్నారు.

Also Read: మీకు బైక్ ఉందా? అయితే ఆ స్కీం కట్..మీరు ఆ లిస్టులో ఉన్నారో లేదో చెక్ చేసుకోండి.!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

SRH VS PBKS: వాట్ ఏ కమ్ బ్యాక్..ఎస్ఆర్హెచ్ దుమ్ము దులిపేసింది మామా..

ఐపీఎల్ 2025లో ఈరోజు అద్భుతమైన మ్యాచ్ జరిగింది. హైదరాబాద్ ఉప్పల్ లో ఈరోజు పంజాబ్ కింగ్స్, హైదరాబాద్ సన్ రైజర్స్ నువ్వా నేనా అన్నట్టు ఆడారు. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 246 పరుగుల టార్గెట్ ఇస్తే దాన్ని ఎనిమిది వికెట్ల తేడాతో ఛేదించింది. 

author-image
By Manogna alamuru
New Update
ipl

SRK VS PBKS

హైదరాబాద్ సన్ రైజర్స్ అద్భుతమైన కమ్ బ్యాక్ ఇచ్చింది. ఐదు మ్యాచ్ లు ఓడిపోయిన తర్వాత ఈరోజు పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ చితక్కొట్టేసింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ లు విజృంభించి ఆడేశారు. పజాబ్ కింగ్స్ ఇచ్చిన 246 పరుగుల భారీ టార్గెట్ ను 8 వికెట్ల తేడాతో సునాయాసంగా ఛేదించింది. ఓపెనర్లు అభిషేక్ వర్మ 141 పరుగులు, ట్రావిస్ హెడ్ 66 పరుగులతో ఇరగదీసారు. ఇద్దరూ కలిసి మ్యాచ్ ను గెలిపించేశారు. 150 పరుగుల ముందు అభిషేక్ వర్మ వికెట్ కోల్పోవడం కొంత నిరాశ కలిగించినా...అతను ఈరోజు ఆడిన తీరుతో ఉప్పల్ స్టేడియం మొత్తాన్ని ఉర్రూతలూగించాడు. అభిషేక్‌ శర్మ 55 బంతుల్లో 14 ఫోర్లు, 10 సిక్స్‌లsy 141 పరుగులు చేసి పంజాబ్‌ బౌలర్లకు చుక్కలు చూపించాడు. వరుస ఫోర్లు, సిక్సర్లతో ఉప్పల్ మైదానంలో పరుగుల వరద పారించాడు. అభిషేక్ ధాటికి పంజాబ్ ఏకంగా ఎనిమిది మందితో బౌలింగ్‌ చేయించింది.  మరోవైపు అతను కొట్టిన బంతులను గ్రౌండ్ స్టాఫ్ వెతుక్కోవడంతోనే సరిపోయింది.  ట్రావిస్ హెడ్ 37 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 66 పరుగులు చేసి అభిషేక్ కు మంచి సపోర్ట్ ఇచ్చాడు.  చివర్లో క్లాసెన్ 14 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌ తో 21, ఇషాన్ కిషన్ 9*; 6 బంతుల్లో 1 సిక్స్ కొట్టి మ్యాచ్ ను గెలిపించారు. 

పంజాబ్ కూడా దుమ్మ రేపింది..

అంతకు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు చెలరేగిపోయింది. తొలి ఇన్నింగ్స్ చేసి కింగ్స్ జట్టు నిర్దేశించిన 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 245 పరుగులు సాధించింది. దీంతో SRH ముందు 246 భారీ టార్గెట్ ఉంది. హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో ఈ మ్యాచ్ జరుగుతోంది. మొదట టాస్ గెలిచిన పంజాబ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్స్‌గా క్రీజులోకి ప్రభ్‌మన్ సింగ్‌, ప్రియాంశ్‌ ఆర్య మొదటి నుంచి దంచి కొట్టారు. బాల్‌ టు బాల్ ఫోర్లు, సిక్సర్లతో దుమ్ము దులిపేశారు. ఉప్పల్ స్టేడియంలో పరుగుల వరద పెట్టించారు. సన్ రైజర్స్ జట్టు బౌలర్లకు చెమటలు తెప్పించారు. ఇక హర్షల్‌ పటేల్‌ బౌలింగ్‌లో (3.6) ప్రియాంశ్‌ ఆర్య (36) నితీశ్‌ రెడ్డికి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.  ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన శ్రేయస్ అయ్యార్ దుమ్ము దులిపేశాడు. పరుగులు రాబడుతూ అదరగొట్టేశాడు. ఫోర్లు, సిక్సర్లతో కెవ్ కేక అనిపించాడు. అతడు 36 బంతుల్లో 82 పరుగులు చేసి ఔటయ్యాడు. అలాగే వధేరా 22 బంతుల్లో 27 పరుగులు, శశాంక్ సింగ్ 3 బంతుల్లో 2 పరుగులు, మాక్స్‌వెల్ 7 బంతుల్లో 3 పరుగులు, స్టొయినీస్ 11 బంతుల్లో 34 పరుగులు చేశారు. 

 today-latest-news-in-telugu | IPL 2025 | srh-vs-pbks

Also Read:  USA: యాపిల్ కు అండగా ట్రంప్..సుంకాల నుంచి ఫోన్లు, కంప్యూటర్లు మినహాయింపు

Advertisment
Advertisment
Advertisment