Telangana : దానంకు కాంగ్రెస్ హైకమాండ్ ఝలక్.. దానం నాగేందర్‌కు కాంగ్రెస్ హైకమాండ్ గట్టి షాక్ ఇవ్వనుందా అంటే అవుననే తెలుస్తోంది. ఎమ్మెల్యేగా రాజీనామా చేయడం లేదని ఎంపీ టికెట్ కూడా క్యాని్సిల్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో మరోసారి బొంతు రామ్మోహన్ పేరు తెర మీదకు వచ్చింది. By Manogna alamuru 29 Mar 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Danam Nagender : బీఆర్ఎస్(BRS) నుంచి కాంగ్రెస్(Congress) లోకి వచ్చిన దానం నాగేందర్(Danam Nagender) కు ఇక్కడ కూడా భారీ ఝలక్ తగలనుంది అని తెలుస్తోంది. దానం తీరుపై అధిష్టానం గుస్సా అవుతోందని చెబుతున్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా ఇస్తే సికింద్రాబాద్(Secunderabad) ఎంపీ సీటు ఇస్తామని ఏఐసీసీ(AICC) చెప్పింది. దానికి ముందు దానం సరే అని తరువాత మాత్రం రాజీనామా చేయనని మొండికేసుకుని కూర్చున్నారు. దీంతో కాంగ్రెస్ అధిష్టానం ఇప్పుడు ఆతనికి ఎంపీ సీటు ఇవ్వడంలేదని సమాచారం. దానం ప్లేస్‌లో సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్ధిగా మరో నేతను పెట్టే యోచనలో ఉంది. ఇక్కడి నుంచి టికెట్ ఆశిస్తున్న బొంతు రామ్మోహన్ పేరును మరోసారి ఏఐసీసీ పరిశీలిస్తోందని టాక్ వినిపిస్తోంది. దానం మీద హైకోర్టులో పిటిషన్... మరోవైపు అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ కండువా కప్పుకున్న దానం నాగేందర్ మీద ఓ వ్యక్తి పిటిషన్ వేశారు. ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి మరో పార్టీలో చేరి ఎంపీగా ఎలా పోటీ చేస్తారంటూరాజు యాదవ్ అనే వ్యక్తి దానంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఓ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఓ వ్యక్తి మరో పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేయడం చట్ట విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధమని ఆ వ్యక్తి తన పిటిషన్ లో పేర్కొన్నారు. దానం నాగేందర్ పార్టీ ఫిరాయించినట్లుగా గుర్తించి ఆయనపై అనర్హత వేటు వేయాలని కోర్టును కోరాడు. ఈ పిటిషన్ మీద ఇవాళ విచారణ జరిగే అవకాశం ఉంది. బీఆర్ఎస్ పార్టీ సైతం ఇప్పటికే ఈ విషయమై స్పీకర్ కు ఫిర్యాదు చేసింది. కేటీఆర్ సైతం ఈ విషయంపై స్పందించారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా దానంను ప్రకటించడంతో ఆయనను స్పీకర్ అనర్హుడిగా గుర్తించాలని కోరారు. Also Read : Movies : అల్లు అర్జున్‌కు అరుదైన గౌరవం.. దుబాయ్ మేడం టుస్సాడ్‌లో వ్యాక్స్ విగ్రహం #congress #mp #telanagna #danam-nagender మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి