Telangana: రేవంత్ సర్కార్ మరో గుడ్ న్యూస్.. యువతులకు ఫ్రీగా స్కూటీస్..! తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ యువతులకు మరో శుభవార్త అందించనుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం చదువుకునే యువతులకు త్వరలోనే ఎలక్ట్రిక్ స్కూటీలను అందించనుంది. ఇందుకు సంబంధించిన ఫారమ్‌ను త్వరలోనే ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌లో పెట్టనున్నట్లు సమాచారం. By B Aravind 27 Jan 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి తెలంగాణలో ఇప్పటికే మహిళలకు ఉచిత బస్ ప్రయాణ సౌకర్యం ఉన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా రేవంత్ ప్రభుత్వం యువతులకు మరో శుభవార్తతో ముందుకు రానుంది. త్వరలోనే యువతులకు ఉచితంగా ఎలక్ట్రికల్ స్కూటీస్‌ను అందించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. తాము అధికారంలోకి వస్తే.. చదువుకునే యువతులకు ఆరు నెలల్లోపు స్కూటీలు అందిస్తామని హామీ ఇచ్చింది. ఇందులో భాగంగానే ఈ స్కీమ్‌ను అమలు చేయనున్నట్లు సమాచారం. అయితే మరి దీనికి ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. Also Read: ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణస్వీకారం.. డేట్స్ ఫిక్స్ కావాల్సిన డ్యాక్యూమెంట్స్ 1. ఆధార్ కార్డు 2. పాస్‌పోర్ట్ సైజు ఫొటో 3. రెసిడెన్స్ ప్రూఫ్ 4. ఇన్ కామ్ సర్టిఫికేట్ 5. క్యాస్ట్ సర్టిఫికేట్ 6. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ 7. పాన్ కార్డు ఇలా అప్లై చేయాలి ముందుగా ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్ (https://telangana.gov.in)లోకి వెళ్లాలి. అయితే త్వరలోనే హోంపేజీలో ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారమ్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఆ ఫారమ్ అందుబాటులోకి రాగానే.. అప్పుడు స్కూటీ స్కీం దరఖాస్తు విధానంపై క్లిక్ చేయగానే.. దరఖాస్తు ఫారం ఓపెన్ అవుతుంది. అందులో మన వివరాలు, చిరునామా ఎంటర్ చేయాలి. ఆ తర్వాత కావాల్సిన డాక్యుమెంట్స్‌ను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతా పూర్తయాక సబ్మిట్ నొక్కి.. అప్లై చేయాలి. ఆ తర్వాత వీటిని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది. పత్రాలను పరిశీలించిన తర్వాత అర్హులను ఎంపిక చేసి వారికి స్కూటీలు అందజేయనుంది. Also Read: సంగారెడ్డిలో భూకంపం.. భయంతో పరుగులు తీసిన ప్రజలు #telugu-news #telangana-news #congress #cm-revanth-reddy #electric-scooties మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి