Harish Rao: కాంగ్రెస్ చేతులెత్తేసింది.. బడ్జెట్‌పై హరీష్ రావు ఫైర్

బడ్జెట్‌లో రైతులకు కాంగ్రెస్ మొండి చెయ్యి ఇచ్చిందని అన్నారు హరీష్ రావు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలు డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామన్నారు.. ఇప్పుడు ఏమైంది? అని ప్రశ్నించారు. కేసిఆర్ రైతు ను రాజు చేస్తే... కాంగ్రెస్ రైతులను మోసం చేసిందని అన్నారు

New Update
Harish Rao: కాంగ్రెస్ చేతులెత్తేసింది.. బడ్జెట్‌పై హరీష్ రావు ఫైర్

Harish Rao : ఈరోజు అసెంబ్లీలో తెలంగాణ(Telangana) కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) ప్రవేశపెట్టిన బడ్జెట్ పై స్పందించారు బీఆర్ఎస్(BRS) నేత, మాజీ మంత్రి హరీష్ రావు(Ex. Minister Harish Rao). బడ్జెట్ నిరాశ పర్చిందని అన్నారు. ప్రజా దర్బార్(Praja Darbar) లో సీఎం ప్రతి రోజు ఉంటానని చెప్పారని.. కానీ సీఎం ఒక్కరోజు మాత్రమే ఉన్నారని అన్నారు. కొండంత ఆశ చూపి గోరంత ఇచ్చారనేలా బడ్జెట్ ఉందని విమర్శించారు.

Also Read : నిన్న జార్ఖండ్ నేడు బిహార్.. హైదరాబాద్ కేంద్రంగా దేశ రాజకీయాలు!

రైతులకు మొండి చెయ్యి...

రైతుల విషయంలో హస్తం కాస్త మొండి చెయ్యి అయ్యిందని అన్నారు హరీష్. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ 9న రుణమాఫీ(Runa Mafi) చేస్తామన్నారు.. ఇప్పుడు ఏమైంది? అని ప్రశ్నించారు. రైతులకు తీవ్ర నిరాశ మిగిల్చింది కాంగ్రెస్ బడ్జెట్ అని అన్నారు. బోనస్ ను బోగస్ చేశారని ఫైర్ అయ్యారు. వారు ఇచ్చిన హామీలన్నీ కావాలంటే 82వేల కోట్లు అవసరం అని గుర్తు చేశారు. కానీ.. కేటాయించింది మాత్రం 16వేల కోట్లు మాత్రమే అని అన్నారు. కాంగ్రెస్ కి రైతుల ఆగ్రహం తప్పదని జోస్యం చెప్పారు.

ఎన్నికల ప్రచారంలోనే కాదు నిండు అసెంబ్లీలో సైతం కాంగ్రెస్ అబద్ధాలు చెబుతుందని ధ్వజమెత్తారు హరీష్. రాష్ట్రంలో ఎక్కడ 24 గంటల కరెంట్ ఇవ్వడం లేదని ఆరోపించారు. ఎక్కడ 24 గంటల కరెంట్ ఇస్తున్నారో నిరూపించేందుకు సిద్ధమా? అని కాంగ్రెస్ పార్టీ నేతలకు సవాల్ విసిరారు. కేసిఆర్ రైతు ను రాజు చేస్తే... కాంగ్రెస్ రైతులను మోసం చేసిందని అన్నారు. ఆరు గ్యారంటిల పై మీరు చెప్పిన చట్టం ఏమైందని ప్రశ్నించారు. శ్వేత పత్రాలతో కాలం గడిపి .. గత ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నమే తప్ప.. ఇచ్చిన మాట మార్చారని ఫైర్ అయ్యారు.

Also Read : బీ కేర్ ఫుల్.. జనసైనికులకు పార్టీ అధినేత పవన్ హెచ్చరిక..!

Advertisment
Advertisment
తాజా కథనాలు