Uttar Pradesh : యోగిని బుల్డోజర్లతో కూల్చిన యూపీ ఓటర్లు.. దూసుకెళ్తున్న ఇండియా కూటమి! ఉత్తరప్రదేశ్ లో బీజేపీకి భారీగా గండి పడింది. యూపీ తమదే అనే ధీమాలో ఉన్న బీజేపీకి ఊహించని షాక్ తగిలింది. ఇండియా కూటమి దుమ్మురేపుతోంది. మొత్తం 80 లోక్ సభ స్థానాలుండగా ఇండియా కూటమి 44 స్థానాల్లో ముందంజలో ఉంది. ఎన్డీయే 35 స్థానాల్లో కొనసాగుతోంది. By srinivas 04 Jun 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Yogi : ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) లో బీజేపీ (BJP) కి భారీగా గండి పడింది. ఉత్తరప్రదేశ్‌లో ఇండియా కూటమి (INDIA Alliance) దుమ్మురేపుతోంది. యూపీ తమదే అనే ధీమాలో ఉన్న బీజేపీకి ఎస్పీ ఊహించని షాక్ ఇచ్చింది. అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ స్పష్టమైన మెజార్టీతో దూసుకెళ్తోంది. మొత్తం 80 స్థానాల్లో ఇండియా కూటమికి చెందిన అఖిలేష్ యాదవ్ సమాజ్ వాదీ పార్టీ 62 సీట్లలోనూ, కాంగ్రెస్ 17 సీట్లలోనూ పోటీ చేస్తున్నాయి. ప్రస్తుతానికి యూపీలో ఇండియా కూటమి 44 స్థానాల్లో లీడింగ్ లో ఉండగా, ఎన్డీయే 35 స్థానాల్లో కొనసాగుతోంది. అయితే 2019 ఎన్నికల్లో ఎన్డీయే ఏకంగా 62 స్థానాలు కైవసం చేసుకుంది. అయితే ప్రస్తుత ఎన్నికల్లో (Elections) మాత్రం యూపీలో రెండు కూటములు హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రధాని మోడీ (PM Modi) వారణాసి నుంచి ఆయన లోక్‌సభకు పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. కాగా కాంగ్రెస్ (Congress) అభ్యర్థి అజయ్ రాయ్ .. ముందంజలో ఉన్నారు. 11480 ఓట్ల తేడాతో అజయ్ రాయ్ లీడింగ్‌లో ఉన్నారు. మోడీ రెండో స్థానంలో కొనసాగుతున్నారు. ఎన్నికల సంఘం వెబ్‌సైట్ ప్రకారం ఆయనకు 5257 ఓట్లు పోలయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా బుల్డోజర్లతో సంచలనం సృష్టించిన యోగిని ఇప్పడు ఒటర్లు అదే బుల్డోజర్లతో కూల్చేశారంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. దేశవ్యాప్తంగా ఎన్డీఏ కూటమి 290 స్థానాల్లో లీడింగ్‌లో ఉండగా.. ఇండియా కూటమి 212 స్థానాల్లో దూసుకెళ్తుంది. Also Read : చంద్రబాబు ఇంటికి పవన్ కళ్యాణ్ #congress #bjp #uttar-pradesh #india-alliance #sp #cm-yogi-aditya-nath మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి