Ayodhya Ram Mandir : అయోధ్యలో డేగ కళ్లతో నిఘా.. పది వేల మందికి పైగా భద్రతా సిబ్బంది

అయోధ్యలో జనవరి 22 ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనున్న వేళ.. కేంద్ర ప్రభుత్వం, యూపీ ప్రభుత్వం భారీ భద్రతను ఏర్పాటు చేస్తోంది. ప్రస్తుతం ఏటీఎస్, ఎస్‌టీఎఫ్, పీసీఎస్, యూపీఎస్ఎఫ్‌, ఇతర విభాగాలకు చెందిన సిబ్బంది అయోధ్యలో రక్షణ బాధ్యతలు చూస్తున్నారు.

New Update
Ayodhya Ram Mandir : అయోధ్యలో డేగ కళ్లతో నిఘా.. పది వేల మందికి పైగా భద్రతా సిబ్బంది

Uttar Pradesh : యూపీ(UP) లోని అయోధ్య(Ayodhya) లో జనవరి 22న బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠాపన జరగనుంది. ఈ వేడుకను చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఆలయ ప్రారంభోత్సవానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలో ప్రధాని మోదీ(PM Modi) తో సహా.. దాదాపు 7వేల మందికి పైగా ప్రత్యేక అతిథులు పాల్గొననున్నారు. అంతేకాదు వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు కూడా హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం భారీ భద్రతను ఏర్పాటు చేస్తోంది

కేంద్రంతో పాటు యూపీ ప్రభుత్వం కూడా భద్రతను పర్వేక్షిస్తోంది. ప్రస్తుతం ఏటీఎస్, ఎస్‌టీఎఫ్, పీసీఎస్, యూపీఎస్ఎఫ్‌, ఇతర విభాగాలకు చెందిన సిబ్బంది అయోధ్యలో రక్షణ బాధ్యతలు చూస్తున్నారు. అంతేకాదు అలాగే రామమందిరం(Ram Mandir) తో సహా.. చుట్టు పక్కల ప్రాంతాల్లో కూడా యూపీ బలగాలతో సహా.. కేంద్ర పారా మిలిటరీకి బలగాలు కూడా వచ్చేశాయి. సుమారు 10 వేల మందికి పైగా సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఇందులో 100కు పైగా డీఎస్పీలు, 325 ఇన్‌స్పెక్టర్లు, 800 మంది ఎస్‌ఐలు ఉన్నారు.

Also Read: కేంద్రం కొత్త నిర్ణయం..ఇక పై వారికి కోచింగ్‌ సెంటర్‌ లలో అనుమతి లేదు!

అర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(AI), హ్యూమన్ ఇంటిలిజెన్స్‌(HI) తో పనిచేసేలా దాదాపు 10 వేలకు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఎలాంటి అనుమానస్పద వస్తువులు పైనుంచి రాకుండా ఏకంగా 4.5 కిలోమీటర్ల పరిధిలో డోమ్‌ ఏర్పాటు చేశారు. అయోధ్యలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనేందుకు ఎయిర్‌ఫోర్స్‌ కూడా రెడీగా ఉంది. ఇప్పటికే భద్రతాపరంగా రిహర్సల్స్‌ కూడా చేసేశారు. బార్‌ కోడింగ్ విధానాన్ని భద్రత చర్యల్లో భాగంగా అనుసరిస్తున్నారు. అలాగే ఉత్తరప్రదేశ్‌- నేపాల్‌ సరిహద్దులో కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు.

ఏఐ టెక్నాలజీ, హ్యూమన్ ఇంటెలిజెన్స్‌తో పని చేసేలా పది వేలకుపైగా సీసీ కెమెరాల్ని ఏర్పాటు చేశారు. అయోధ్య(Ayodhya) మొత్తం డ్రోన్లతో నిఘా పెట్టారు. దాదాపు 7 రోజులపాటు జరిగే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాల్లో భాగంగా గురువారం కలశ పూజను చేశారు. కేవలం అయోధ్యలోనే కాకుండా దేశంలో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు పలు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.

Also Read: అయోధ్య రామమందిరం గర్భగుడి లోపల రామ్‌ లల్లా విగ్రహం మొదటి చిత్రం !

Advertisment
Advertisment
తాజా కథనాలు