Stock Market : కుప్పకూలిన స్టాక్ మార్కెట్...భారీగా నష్టపోయిన సెన్సెక్స్, నిఫ్టీ భారత స్టాక్ మార్కెట్ ఈరోజు నిరాశాజనకంగా ప్రారంభమైంది. సెన్సెక్స్ , నిఫ్టీ లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 1130 పాయింట్లు, నిఫ్టీ 370 పాయింట్లు దిగువన ప్రారంభమయ్యాయి. By Madhukar Vydhyula 17 Jan 2024 in బిజినెస్ నేషనల్ New Update షేర్ చేయండి Stock Market Today: భారత స్టాక్ మార్కెట్ ఈరోజు నిరాశాజనకంగా ప్రారంభమైంది. సెన్సెక్స్ (Sensex) , నిఫ్టీలు (Nifty) భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. మంగళవారం సెన్సెక్స్ 73128.77 పాయింట్ల వద్ద, నిఫ్టీ 22,032 పాయింట్ల వద్ద క్షీణతతో ముగిశాయి. ఇక బుధవారం సెన్సెక్స్ 1130 పాయింట్లు, నిఫ్టీ 370 పాయింట్లు దిగువన ప్రారంభమయ్యాయి. మంగళవారం సాయంత్రం మార్కెట్ ముగిసిన తర్వాత హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (HDFC) ఫలితాలను విడుదల చేసింది. దీని ప్రభావం బుధవారం ఉదయం మార్కెట్ పైన స్పష్టంగా కనిపించింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ త్రైమాసిక ఫలితాల తర్వాత బుధవారం బహిరంగ మార్కెట్‌లో నిరాశ నెలకొంది. హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు రూ.109 తగ్గి రూ.1570 వద్ద 6 శాతం క్షీణతతో ప్రారంభమయ్యాయి. ఇది కూడా చదవండి :Power Cuts: హైదరాబాద్ లో మొదలైన విద్యుత్ కోతలు..నేటి నుంచి ఎప్పటి వరకు బుధవారం బీఎస్‌ఈలో (BSE) హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు భారీగా నష్టపోయాయి. దీంతో పాటు బంధన్ ఎస్ & పి, లోధా డెవలపర్స్, గ్రావిటా ఇండియా, ఇండియా ఎనర్జీ ఎక్స్ఛేంజ్ షేర్లు ట్రేడింగ్ లో భారీ పతనం కనపించింది. నిఫ్టీలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పాటు టాటా స్టీల్, బజాజ్ ఆటో, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, హిందాల్కోషేర్లు భారీగా నష్టపోయాయి. బ్యాంక్ నిఫ్టీలో 1552 పాయింట్ల క్షీణత నమోదైంది. దీంతో పాటు ఆసియా మార్కెట్లు కూడా క్షీణతతో ప్రారంభమయ్యాయి. డిసెంబర్ త్రైమాసికంలో చైనా ఆర్థిక వృద్ధి రేటు (China) తక్కువగా ఉండటం మూలంగా ఆ ప్రభావం స్టాక్ మార్కెట్లపైనా స్పష్టంగా కనిపిస్తుంది. దీనివల్ల జపాన్ మార్కెట్లు కూడా 1.3 శాతం నష్టపోయాయి. వాల్ స్ట్రీట్ కూడా క్షీణతతో ముగిసింది. సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లను తగ్గించకూడదని ఫెడరల్ రిజర్వ్ అధికారులు సూచించారు. ఒక వేళ వడ్డీ రేట్లు తగ్గిస్తే ఆ ప్రభావం ఎలా ఉంటుందని మార్కెట్ అంచనా వేస్తోంది. Also Read :Tammineni VeeraBhadram: తమ్మినేని వీరభద్రం హెల్త్ బులిటెన్ విడుదల.. వైద్యులు ఏమన్నారంటే.. బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో పతనమవుతున్న వాటిలో బ్యాంక్ ల షేర్లే అధికంగా ఉన్నాయి. వాటిలో ఎస్ బ్యాంక్, ఐసీఐసీఐ, యాక్సిస్, కోటక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర తదితర బ్యాంక్ లు ఉన్నాయి. బుధవారం ప్రారంభమైన మార్కెట్ (Stock Market) లో కొచ్చిన్ షిప్‌యార్డ్ , ఎంఎస్‌టీసీ లిమిటెడ్, సీజీసీఎల్, ఐసీఐసీఐ జనరల్ ఇన్సూరెన్స్ లు బీఎస్ఈలో ట్రేడింగ్ లో ఉన్నాయి. ఇక నిఫ్టీలో ఇన్ఫోసిస్, అల్ట్రాటెక్ సిమెంట్ అదానీ పోర్ట్స్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, టీసీఎస్ లు లాభాలతో ప్రారంభమయ్యాయి. #stock-market-today #bse #sensex #nifty మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి