Vande Bharat: వందే భారత్ ఆహారంలో బొద్దింక.. సారీ చెప్పిన రైల్వేశాఖ

ఇండియాలో వందే భారత్‌ రైళ్ళకు ప్రత్యేకత ఉంది. అధునాతన హంగులతో ఉండే ఈ ట్రైన్‌లో సౌకర్యాలు కూడ అలానే ఉంటాయి. అయితే ఇందులో కూడా లోపాలు బయటపడుతున్నాయి. తాజాగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఇచ్చిన ఆహారంలో బొద్దింక వచ్చింది.

New Update
Vande Bharat: వందే భారత్ ఆహారంలో బొద్దింక.. సారీ చెప్పిన రైల్వేశాఖ

రైళ్ళల్లో ఇచ్చే ఆహారం మీద ఎప్పుడ ఏదో ఒక కంప్లైంట్ ఉంటూనే ఉంటుంది. క్వాలిటి విషయంలో, నీట్ నెస్ విషయంలో ఇలా చాలా. దీని మీద ఎన్ని ఫిర్యాదులు వచ్చినా మార్పు రావడం లేదు. ఇప్పుడు ఇది వందే బారత్ ట్రైన్స్‌కు కూడా పాకింది. కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ సెమీ హైస్పీడ్‌ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో అందించే ఆహారంపై గత కొన్ని రోజులుగా ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. మామూలు రైళ్ళల్లో కంటే వీటిల్లో ఫుడ్ చెత్తగా ఉంటందని కంప్లైట్స్ వస్తున్నాయి. తాజాగా ఓ జంటకు ఇలాంటి అనుభవమే ఎదురైంది.

భోపాల్ నుంచి ఆగ్రాకు వెళుతున్న వందే భారత్ రైలులో ఓ జంటకు ఇచ్చిన ఆహారంలో చచ్చిన బొద్దింక కనిపించింది. ఈ విషయాన్ని విదిత్‌ వర్ష్నే అనే వ్యక్తి తన ఎక్స్‌ లో పోస్టు చేశారు. ఈనెల 18వ తేదీన మా ఆంటీ, అంకుల్‌ వందేభారత్‌ రైలులో భోపాల్‌ నుంచి ఆగ్రా వరకూ ప్రయాణించారు. ఆ సమయంలో ఐఆర్‌సీటీసీ పెట్టిన భోజనంలో బొద్దింక వచ్చింది అని పోస్టు పెట్టారు.దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని, మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోండి అంటూ రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ట్యాగ్‌ చేశారు.

దీనిపై రైల్వేశాఖ కూడా స్పదించింది. ఆహారంలో బొద్దింక వచ్చిందుకు క్షమాపణలు కూడా చెప్పింది. ఫుడ్ ప్రొవైడర్‌ మీద చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించాం. సంబంధిత సర్వీస్‌ ప్రొవైడర్‌కు తగిన జరిమానా విధించామని తెలిపింది.

Also Read:Pawan Kalyan: ఏపీ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ అధికారులతో పవన్ కల్యాణ్‌ సమీక్ష

Advertisment
Advertisment
తాజా కథనాలు