Up Assembly: ముస్లింల పూర్వీకులు కూడా సనాతన ధర్మం పాటించిన వారే: యూపీ సీఎం యోగి!

రామ మందిర నిర్మాణం పట్ల ప్రతి సనాతనీ సంతోషిస్తున్నారని, ముస్లింల పూర్వీకులు కూడా సనాతనిలే. రామమందిరాన్ని ముందుగా నిర్మించి ఉండాల్సిందని చాలా మంది ముస్లింలు అన్నారని యూసీ సీఎం యోగి అన్నారు.

New Update
Up Assembly: ముస్లింల పూర్వీకులు కూడా సనాతన ధర్మం పాటించిన వారే: యూపీ సీఎం యోగి!

Up Cm : యూపీ అసెంబ్లీ (Up Assembly) లో గవర్నర్ ప్రసంగంపై జరిగిన చర్చ పై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బుధవారం స్పందించారు. సీఎం యోగి తన ప్రసంగంలో, అభివృద్ధి చెందిన భారతదేశం నా నిబద్ధత అని అన్నారు. ఈ సమయంలో, అతను సమాజ్ వాదీ పార్టీ నాయకుడు, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్‌ను లక్ష్యంగా చేసుకుని మాటల తూటలు పేల్చారు.

కావాలనే అఖిలేష్‌ యాదవ్‌ తన ప్రసంగం నుంచి దృష్టిని మళ్లిస్తున్నాడని, అతను చెప్పే మాటల్లో ఒకటి కూడా నిజం లేవని యోగి అన్నారు. అయోధ్య రామ మందిరం విషయంలో కూడా ఇలాగే విపక్షాలను టార్గెట్ చేసి ఆయన మాట్లాడారు. రామ మందిర నిర్మాణం పట్ల యావత్‌ దేశమంతా సంతోషంగా ఉన్నారని యోగి అన్నారు.

 ఎస్పీ-బీఎస్పీ గుర్తింపు సంక్షోభం...

2017కు ముందు ఉత్తరప్రదేశ్‌ను పాలించిన వారు.. ఉత్తరప్రదేశ్‌ను ఎక్కడికి తీసుకెళ్లారు.. ఉత్తరప్రదేశ్ ప్రజలకు గుర్తింపు సంక్షోభం సృష్టించారు. ఇక్కడి యువత తమ గుర్తింపును దాచిపెట్టారు. ఈ రాష్ట్ర యువకుడు ఎక్కడికి వెళ్లినా.. ఉద్యోగం పొందలేకపోయాడు. కనీసం హోటళ్లు, ధర్మశాలల్లో కూడా గదులు పొందలేకపోయారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

'నేను అయోధ్య-కాశీకి వెళ్లాను, నోయిడా, బిజ్నోర్‌లకు కూడా వెళ్లాను'

రామ మందిర నిర్మాణం పట్ల ప్రతి సనాతనీ సంతోషిస్తున్నారని, ముస్లింల పూర్వీకులు కూడా సనాతనిలే. అయితే శతాబ్దపు అతి పెద్ద ఘటనపై ప్రతిపక్షాలు ఏమీ మాట్లాడకుండా అక్కడక్కడ తిరుగుతూనే ఉన్నాయి. రామమందిరాన్ని ముందుగా నిర్మించి ఉండాల్సిందని చాలా మంది ముస్లింలు అన్నారు. "ఈ రోజు ప్రతి భారతీయుడు కొత్త, దివ్య, గొప్ప అయోధ్యను చూసి పొంగిపోతున్నాడు. ఈ పని చాలా కాలం క్రితమే జరిగి ఉండాలి. అయోధ్య ప్రజలకు విద్యుత్తు ఏర్పాటు చేసి ఉండవచ్చు, అక్కడ మెరుగైన ఆరోగ్య సౌకర్యాలు కల్పించవచ్చు. ఈ అభివృద్ధి పనులు ఏ ఉద్దేశంతో ఆగిపోయాయి? నేను అయోధ్య, కాశీకి కి మాత్రమే వెళ్లాను అనుకుంటే, నేను నోయిడా, బిజ్నోర్‌లకు కూడా వెళ్లాను." మా విశ్వాసం , విధానం , ఉద్దేశాలు కూడా స్పష్టంగా ఉన్నాయని యోగి అన్నారు.

యోగి ప్రభుత్వంపై అఖిలేష్

అంతకుముందు యూపీ అసెంబ్లీ బడ్జెట్ సెషన్ సందర్భంగా అఖిలేష్ యాదవ్ బీజేపీ, యోగి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. రైతులకు బీజేపీ ద్రోహం చేసిందని అఖిలేష్ అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏదైనా కొత్త మార్కెట్‌ను ఏర్పాటు చేసిందా? మూడు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతులు మాట్లాడినప్పుడు సుమారు 1000 మంది రైతులు ప్రాణాలు కోల్పోయిన మొదటి ప్రభుత్వం ఇదే. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి ఆయన ఫార్ములా ఏమిటి? అంటూ బీజేపీ పై విరుచుకుపడ్డారు.

Also read:  ఆర్బీఐ పుణ్యమా అంటూ ఈ యాప్‌ లకు భారీగా పెరిగిన డిమాండ్‌!

Advertisment
Advertisment
తాజా కథనాలు