CM Revanth : రిజర్వేషన్ల ఆధారంగానే లోక్‌సభ ఎన్నికలు : రేవంత్ రిజర్వేషన్ల ఆధారంగానే లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయని.. ధర్మపురిలో నిర్వహించిన జనజాతర సభలో సీఎం రేవంత్ అన్నారు. బీజేపీకి ఓటు వేస్తే రిజర్వేషన్ల రద్దుకు.. కాంగ్రెస్‌కు ఓటేస్తే రిజర్వేషన్లు పెంచేందుకు ఉపయోగపడుతుందని వ్యాఖ్యానించారు. By B Aravind 03 May 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Reservations : లోక్‌సభ ఎన్నికల(Lok Sabha Elections) నేపథ్యంలో అధికార, విపక్ష నేతలు ఎన్నికల ప్రచారాల్లో(Election Campaign) మునిగిపోయారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy).. పెద్దపల్లి కాంగ్రెస్(Congress) ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు మద్దతుగా ధర్మపురిలో నిర్వహించిన జనజాతర సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. రిజర్వేషన్ల ఆధారంగానే లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయని అన్నారు. బీజేపీ నేతలు నోరు తెరిస్తేనే అబద్ధాలు చెబుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ వాట్సాప్ వర్సిటీలో అన్ని అబద్ధాలే ప్రచారాలు చేస్తున్నారని .. పదేళ్ల పాటు దేశానికి ప్రధానిగా ఉన్న మోదీ, ఐదేళ్లు కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి తెలంగాణకు ఏం చేశారో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. Also Read: అమిత్ షాపై కేసు నమోదు.. ఏ3గా చేర్చిన పోలీసులు ' విభజన చట్టంలో సోనియాగాంధీ ఇచ్చిన బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని కాలగర్భంలో కలిపేశారు. కాజీపేటకు రావాల్సిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీని లూతూర్‌కు తరలించారు. 4 వేల మెగావాట్ల సామర్థ్యంలో ఎన్‌టీపీసీ విద్యుత్ ఉత్పత్తి సంస్థను నిర్మించాల్సి ఉంది. కానీ పదేళ్లలో కేవలం 1600 మెగావాట్లతో నిర్మించారు. సోనియాగాంధీ రంగారెడ్డి జిల్లాకు ఐటీఐఆర్ కారిడార్‌ను రంగారెడ్డి జిల్లాకు ఇస్తే దాన్ని రద్దు చేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదు. గిరిజన యూనివర్సిటీ, ఐఐటీ, ఐఐఎం ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద జాబితానే ఉంది. కానీ గుజరాత్‌కు మాత్రం బుల్లెట్ రైలు, సబర్మతి రివర్ ఫ్రంట్ తీసుకెళ్లారు. దాదాపు రూ.లక్ష కోట్ల నిధులు తరలించుకుపోయారు. తెలంగాణలో ఉన్నవారు మనుషులు కాదా.. రాష్ట్రంపై బీజేపీ నేతలు సవతి తల్లి ప్రేమను చూపిస్తున్నారు. ' కులగణన చేపట్టి.. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లను పెంచాలని కాంగ్రెస్ నిర్ణయించింది. కానీ రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లను రద్దు చేయాలని బీజేపీ కుట్రకు పాల్పడుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో 400 సీట్లు వస్తే.. మూడోవంతు మెజార్టీతో రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను రద్దు చేస్తారు. రిజర్వేషన్ల రద్దుకు దేశంలో 50 శాతం రాష్ట్రాలు ఆమోదం తెలపాలి. అందుకే 8 రాష్ట్రాల్లో విపక్ష పార్టీల ప్రభుత్వాలను పడగొట్టి బీజేపీ ప్రభుత్వాలను అధికారంలోకి తీసుకొచ్చారు. బీజేపీకి ఓటు వేస్తే రిజర్వేషన్ల రద్దుకు ఇది దోహదపడుతుంది. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే.. రిజర్వేషన్లు పెంచేందుకు ఉపయోగపడుతుందని'రేవంత్ అన్నారు. మరోవైపు నేతకాని కార్పొరేషన్, సింగరేణి సమస్యలు పరిష్కరిస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ఓటు అడిగే నైతిక హక్కు లేదని అన్నారు. పోటీ చేసే అభ్యర్థి లేకపోవడంతో.. ధర్మపురి ప్రజలు గతంలో తిరస్కరించిన కొప్పుల ఈశ్వర్‌నే మళ్లీ ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టిందంటూ విమర్శించారు. Also Read: కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్‌పై విచారిస్తాం : సుప్రీంకోర్టు #telugu-news #congress #cm-revanth-reddy #lok-sabha-elections-2024 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి