Telanagana:రారా చూసుకుందాం.. కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ బొక్క బోర్లా పడ్డా బీఆర్ఎస్‌కు ఇంకా బుద్ధి రాలేదు అంటూ ఫైర్ అయ్యారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీలో ఈరోజు బీఆర్ ఎస్ తీరుమీద, కేసీఆర్ మీదనా మాటలతో విరుచుకుపడ్డారు. రారా చూసుకుందాం అంటూ సవాల్ చేశారు. By Manogna alamuru 14 Feb 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి CM Revanth Reddy Fire on KCR:బొక్క బోర్లా పడ్డా బీఆర్ఎస్‌కు ఇంకా ఇంకా బుద్ధి రాలేదు అంటూ ఫైర్ అయ్యారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీలో ఈరోజు బీఆర్ ఎస్ తీరు మీద, కేసీఆర్ మీదనా మాటలతో విరుచుకుపడ్డారు. నా భాష గురించి మాట్లాడే ముందు మాజీ సీఎం వాడిన బాష మీద చర్చ చేద్దామా అంటూ పిలుపునిచ్చారు. రారా చూసుకుందాం అంటూ సవాల్ విసిరారు.తెలంగాణ సమాజం పట్ల, రైతులపట్ల గౌరవం ఉంటే ప్రధాన ప్రతిపక్షం మేడిగడ్డ కు వచ్చేది..కుంగిన మేడిగడ్డలో నీళ్ళు నింపే పరిస్థితి ఉందా...కూలింది రెండు పిల్లర్లు అయితే వాటి మీద మాట్లాడ్డానికి అయినా కేసీఆర్ సభకు రావాలని పిలుపు నిచ్చారు రేవంత్ రెడ్డి. కడియం శ్రీహరి, హరీష్ లకే పెత్తనం ఇస్తాం.. నీళ్లు నింపి చూపించండి అంటూ సవాల్ చేశారు. సాగునీటి ప్రాజెక్టులపై శ్వేత పత్రం పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దానిపై చర్చించండి..కాళేశ్వరంపై కూడా మేం చర్చకు సిద్ధంగా ఉన్నాం అన్నారు. Also Read:Virushka Love Story:క్రికెట్, సినిమా ప్రేమకథ..ప్రపంచం మనసు గెలుచుకున్న లవ్ స్టోరీ మీ నాయకుడు ఎక్కడ? మూడు రోజుల సభలో అన్ని విషయాలు చర్చిద్దాం అనుకున్నాము. మేడిగడ్డ చూసి వచ్చి చర్చ చేద్దాం...పోదాం అన్నాం. పిలిస్తే వాళ్ళు రాలేదు. ఇప్పుడేమో కొత్తగా వచ్చినవాళ్ళదే తప్పు అని మాట్లాడుతున్నారు అంటూ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. చర్చకు సిద్ధమైతే మీ సభాపక్ష నేతను అసెంబ్లీకి రమ్మనండి అంటూ కడియం శ్రీహరికి చురకలు అంటించారు రేవంత్. పారిపోయి అక్కడెక్కడో ప్రగల్భాలు పలకడం కాదు..అంటూ ఎద్దేవా చేశారు. పదే పదే బీఆరెస్ నేతలు భాష గురించి మాట్లాడుతున్నారు..మాజీ సీఎం నిన్న నల్లగొండలో మాట్లాడిన భాషపై చర్చిద్దామా?ఒక సీఎంను పట్టుకుని ఏం పీకనీకి పోయారు అన్నది మరి వాళ్ళు మాట్లాడాల్సిన బాష అదేనా ఫైర్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రజలు మొన్నటి ఎన్నికల్లో మీ ప్యాంటు పీకేశారు. పైగా మా నాయకుడిని చంపడానికి చూస్తున్నారా అంటూ ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్‌ను వేరేగా చంపక్కర్లేదు..ఆయన మొన్న ఎన్నికల్లో చచ్చిన పాము అంటూ కామెంట్ చేశారు సీం రేవంత్ రెడ్డి. #brs #kcr #cm-revanth-reddy #assembly #telanagna మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి