Dharani Portal: ధరణి పోర్టల్ పై రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం

ధరణి పోర్టల్‌పై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి స్పెషల్ డ్రైవ్ నిర్వహించనుంది. మార్చి 1 నుంచి 9వ తేదీ వరకు స్పెషల్ డ్రైవ్ చేపట్టనుంది. ధరణిలో పెండింగ్ దరఖాస్తుల సంఖ్య 2,45,037 ఉన్నట్లు తెలిపింది

New Update
Dharani Portal: ధరణి పోర్టల్ పై రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం

Dharani Portal: తెలంగాణ ప్రజలు ధరణిలో ఎదురుకుంటున్న సమస్యల పరిష్కారానికి రేవంత్ సర్కార్ గైడ్ లైన్స్ ను విడుదల చేసింది. ఈ మేరకు కలెక్టర్లకు సీసీఎల్ఏ మార్గదర్శకాలు సూచించింది. మార్చి ఒకటి నుంచి మార్చి 9 వరకు ధరణి సమస్యలను పరిష్కారించేందుకు రాష్ట్రవ్యాప్తంగా సదస్సులు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ధరణి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఈ ప్రత్యేక డ్రైవ్‌ను మార్చి 1 నుంచి 9 వరకు రెవెన్యూ శాఖ చేపట్టనుంది. మండలాల్లోనే అధికారులు దరఖాస్తులను పరిష్కరించనున్నారు. ధరణి పోర్టల్‌లో సవరింపు కోసం 2,45,037 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని అధికారులు తెలిపారు. పట్టాదారు పాస్‌ బుక్కుల్లో డేటా కరెక్షన్‌ కోసం లక్షకుపైగా అప్లికేషన్లు ఉన్నట్లు పేర్కొన్నారు. 17 రకాల మాడ్యూల్స్‌ సవరణకు వచ్చిన దరఖాస్తుల సంఖ్య 2.45 లక్షలుగా ఉంది. నిషేధిత జాబితా పార్ట్‌-బిలో 13 లక్షల ఎకరాలు రికార్డుల అప్‌డేషన్‌ పేరుతో ఉన్నాయి. కారణాలు లేకుండా నిషేధిత జాబితాలో 5.07 లక్షల ఎకరాలు ఉన్నట్లు సమాచారం. వీటిని పరిష్కరించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

వారం రోజుల్లో పరిష్కరించకుంటే..

ఈ క్రమంలో 24వ తారీఖున ధరణిపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన రివ్యూలో ధరణి అప్లికేషన్లను వెంటనే క్లియర్ చేయాలని ఆదేశించారు. అందుకు అనుగుణంగా ధరణి కమిటీ కొన్ని సూచనలు చేసింది. తహశీల్దార్, ఆర్టీవో, అడిషనల్ కలెక్టర్లు, కలెక్టర్ల సమక్షంలో కమిటీలు పని చేస్తాయి. టైం లైన్ విధించి ఆ లోపు పెండింగ్ అప్లికేషన్లను క్లియర్ చేయాలని ఆదేశించింది. కరెక్షన్ చేసిన అప్లికేషన్ల వివరాలను ఎలక్ట్రానిక్స్ రికార్డ్స్ లో భద్రపరచాలని సూచించింది.

ధరణి అడ్డం పెట్టుకొని ఆక్రమించిన ప్రభుత్వ భూముల విషయంలో కఠినంగా వ్యవహరించాలి. ఆధార్ నెంబర్ మిస్ మ్యాచ్, రైతుల పేర్లు తప్పుగా ఉండి ఆగిపోయిన అప్లికేషన్లు, ఫొటో మిస్ మ్యాచ్ వంటి పెండింగ్ అప్లికేషన్లను సత్వరమే పరిష్కరించాలి. అసైన్డ్ ల్యాండ్‌ల సమస్యలు పరిష్కరించాలి. పాస్ బుక్ కరెక్షన్స్, పాస్ బుక్‌లో మిస్ అయిన పేర్లు, సర్వే నెంబర్లు, కాటా మర్జింగ్, ఒక మండల ఆఫీసులో తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లతో కలిపి టీంలు ఏర్పాటు చేయాలి. పెండింగ్ అప్లికేషన్లను మోజుల వైస్ విభజించాలి. అభ్యర్థుల ఫోన్ నెంబర్ల ద్వారా వాట్సాప్ ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం వెంటనే చేరవేయాలని ఆదేశాల్లో పేర్కొంది. అప్లికేషన్లను క్లియర్ చేసే ముందు ప్రభుత్వ రికార్డులో వాటి వివరాలను తప్పనిసరిగా చెక్ చేయాలని ప్రభుత్వం సూచించింది. అన్ని అప్లికేషన్స్ మార్చి ఒకటి నుంచి తొమ్మిది లోగానే క్లియర్ చేయాలని ఆదేశించింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు